నాంపల్లి రైల్వే స్టేషన్ లో..రూ. 9 లక్షల నగదు సీజ్

నాంపల్లి రైల్వే స్టేషన్ లో..రూ. 9 లక్షల నగదు సీజ్

బషీర్ బాగ్, వెలుగు : నాంపల్లి రైల్వే స్టేషన్ లో 9 లక్షలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు జనరల్ రైల్వే పోలీస్ స్టేషన్ (జీఆర్పీ) నాంపల్లి ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నాంపల్లి రైల్వేస్టేషన్ లో గురువారం ఆర్పీఎఫ్ పోలీసులు ప్యాసింజర్ల బ్యాగులను తనిఖీ చేస్తున్నారు.  ఫ్లాట్ ఫాం నం. 4లో ఏపీలోని బాపట్ల జిల్లా చీరాలకు చెందిన బాలకృష్ణ బ్యాగ్ తో అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు.

అందులో రూ. 9 లక్షల నగదు దొరికింది. సంబంధిత ఆధార పత్రాలు చూపకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వ్యాపార లావాదేవీల కోసం నగదును చెన్నై ఎక్స్ ప్రెస్ లో బాపట్ల కు తీసుకెళ్తున్నట్లు బాలకృష్ణ చెప్పినట్టు ఇన్ స్పెక్టర్ తెలిపారు. సీజ్ చేసిన నగదును సికింద్రాబాద్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి నాంపల్లి ఆర్పీఎఫ్ పోలీసులు అందజేశారు.