ఆస్పత్రి సిబ్బంది చేతివాటం.. 50 లక్షల డైమండ్ ఉంగరం చోరీ

ఆస్పత్రి సిబ్బంది  చేతివాటం.. 50 లక్షల  డైమండ్ ఉంగరం చోరీ

హైదరాబాద్  జూబ్లీహిల్స్ లోని  ఓ ప్రైవేట్  ఆస్పత్రి  సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ నుంచి రూ. 50లక్షల విలువ చేసే డైమండ్ ఉంగరాన్ని చోరీ చేశారు. జూబ్లీహిల్స్ లోని ఎఫ్ఎమ్ఎస్ దంత ,చర్మ  ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.

జూన్ 27న  ఎఫ్ఎమ్ఎస్ ఆస్పత్రికి  బంజారాహిల్స్ కు చెందిన  ఓ మహిళ  చికిత్స కోసం వచ్చింది. చికిత్స చేసేటప్పుడు  చేతికున్న  డైమండ్ రింగ్ ను  తీసి పక్కన పెట్టిన ఆ మహిళ.. తర్వాత ఉంగరాన్ని మరిచిపోయి ఇంటికి వెళ్లింది.  ఆలస్యంగా ఉంగరం విషయాన్ని గుర్తించిన ఆ మహిళ హాస్పిటల్ కు వెళ్లి సిబ్బందిని నిలదీసింది. సిబ్బంది సమాధానం చెప్పకపోవడంతో  జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చంది.  పోలీసులు ఆస్పత్రి సీసీ కెమెరాలు తనిఖీ చేస్తుండగా.. అందులో పనిచేసే ఓ మహిళా సిబ్బంది  నిజం ఒప్పుకుంది.   టిష్యూ పేపర్లో ఉంగారాన్ని చుట్టి పర్స్ లో దాచిపెట్టానని.. అనంతరం భయంతో  బాత్రూం కామెడ్ లో   పడేసానని పోలీసులకు తెలిపింది.  దీంతో పోలీసులు బాత్రూం తవ్వి ఉంగారాన్ని వెలికి తీశారు . మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.