
శంకర్ ..హీరో కమల్ హాసన్ కాంబోలో వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా రూపొందుతున్నదే ‘ఇండియన్ 2’(Indian 2). యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, సముద్రఖని తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ (AN INTRO) సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.పెంచడమే కాదు..కమల్‌హాసన్ వాడే ఆయుధం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఇదిలా ఉంటే..తాజా సమాచారం ప్రకారం..త్వరలో ఈ మూవీ మే 16న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆడియో లాంఛ్ నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు వటాక్ వినిపిస్తోంది. కాగా ఈవెంట్‌కు ఇద్దరు స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
గ్లోబల్ హీరోగా స్టార్ డమ్ తెచ్చుకున్న రాంచరణ్, తలైవా రజినీకాంత్ గెస్టులుగా రానున్నారట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే తెలుగు తమిళ ఫ్యాన్స్ కు మాత్రం పండగే అని చెప్పొచ్చు. మరి దీనిపై మేకర్స్ త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే క్లర్క్ నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో చూపించిన చిత్రం భారతీయుడు. ఈ మూవీకి సీక్వెల్ గా వస్తోన్న భారతీయుడు 2 మూవీని శంకర్ ఎంతో ప్రేస్టీజియస్ ఫిల్మ్గా తెరకెక్కిస్తున్నాడు.
ఈ మూవీని జూన్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించగా..డేట్‌పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.