బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్​

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్​

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.  మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు రానున్నాయి.మే  నెలలో బ్యాంక్‌లకు మొత్తం 12 హాలిడేస్‌ వచ్చాయి. వీటిలో 2 &4 శనివారాలు, ఆదివారాలు కలిసి ఉన్నాయి.  ఇంతకీ మే నెలలో బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు ఏదో ఒక పని కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఆన్‌లైన్ లో ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా కొన్ని పన్ను బ్యాంకులకు వెళ్లి చేయాల్సి ఉంటుంది. వారితో పాటు బ్యాంకులో ఖాతా ఉన్న వారు సైతం బ్యాంక్ సెలవుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే  మే, 2024 నెలలో భారీగానే సెలవులు ఉన్నాయి. ప్రాంతాలను బట్టి మొత్తంగా 12 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. దీంతో బ్యాంకులో పనిపడినప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

మే నెలలో 12 రోజులు బ్యాంకు సెలవులివే

  • మే 01 (బుధవారం): మహారాష్ట్ర దినోత్సవం/ మే డే (కార్మిక దినోత్సవం) సందర్భంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, అమరావతి, ఇంఫాల్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పట్నా, తిరువనంతపురం తదితర ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
  • మే 05: ఆదివారం.
  • మే 08 (బుధవారం): రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని అన్ని బ్యాంకుల బంద్ కానున్నాయి.
  • మే 10 ‍‌(శుక్రవారం): బసవ జయంతి/ అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరులో బ్యాంకులకు సెలవు.
  • మే 11: రెండో శనివారం. దేశంలోని అన్ని బ్యాంక్‌లు క్లోజ్.
  • మే 12: ఆదివారం.
  • మే 16 (గురువారం): రాష్ట్ర దినోత్సవం సందర్భంగా గ్యాంగ్‌టక్‌లోని అన్ని బ్యాంకులకు సెలవు
  • మే 19: ఆదివారం.
  • మే 20 ‍‌(సోమవారం): లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బేలాపూర్, ముంబైలోని బ్యాంకులను మూసేస్తారు.
  • మే 23 ‍‌(గురువారం): బుద్ధ పూర్ణిమ సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, ఇటానగర్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూదిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులు పని చేయవు.
  • మే 25: నాలుగో శనివారం. దేశంలోని అన్ని బ్యాంక్‌లలకు సెలవు.
  • మే 26: ఆదివారం.