CSK vs SRH: గైక్వాడ్ సెంచరీ మిస్.. సన్ రైజర్స్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

CSK vs SRH: గైక్వాడ్ సెంచరీ మిస్.. సన్ రైజర్స్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

ఐపీఎల్ లో బౌలర్ల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. చెపాక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై చెన్నై సూపర్ కింగ్స్ పరుగుల వరద పారించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్(54 బంతుల్లో 98, 10 ఫోర్లు, 3 సిక్సులు) భారీ ఇన్నింగ్స్ కు తోడు.. డారిల్ మిచెల్(32 బంతుల్లో 52,7 ఫోర్లు, ఒక సిక్సర్) దూబే(20 బంతుల్లో 39, ఫోరు,4 సిక్సులు) మెరుపులు మెరిపించారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నైకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రహానే 9 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో ఇన్నింగ్స్ ను గైక్వాడ్, మిచెల్ ముందుకు తీసుకెళ్లారు. ప్రారంభం నుంచి దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్ కు 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పటిష్ట స్థితికి చేర్చారు. హాఫ్ సెంచరీ చేసి మిచెల్ ఔటై.. దూబే, గైక్వాడ్ చివరి వరకు క్రీజ్ లో ఉంది చెన్నైకు భారీ స్కోర్ అందించారు.

ఇన్నింగ్స్ ఆసాంతం బాగా ఆడిన గైక్వాడ్.. తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. 98 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, షాబాజ్ అహ్మద్, ఉనాద్కట్ తలో వికెట్ తీసుకున్నారు.