కలికాలం.. రోబోతో ప్రేమలో పడ్డ ఇంజనీర్​... పెళ్లి కూడా చేసుకుంటాడట..

కలికాలం.. రోబోతో ప్రేమలో పడ్డ ఇంజనీర్​... పెళ్లి కూడా చేసుకుంటాడట..

కొందరు యువత.. తమ కాలేజీలో క్లాసులో చేప్పే టీచర్లతో కూడా ప్రేమలో పడుతుంటారు. ఇదంతా కామన్. మనకు తెలిసిందే. కానీ కొందరు మాత్రం వెరైటీగా జంతువులతో ప్రేమలో పడుతుంటారు. ఇంకొందరు చెట్లతో, వస్తువులతో కూడా ప్రేమలో పడేవాళ్లను చూశాం. కానీ తాజాగా, ఒక యువకుడు  రోబోతో ప్రేమలో పడినట్లు తెలిపాడు. అంతేకాకుండా మూఢాల్లోనే పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది

రోబో" సినిమాలో రోబో రజనీకాంత్, మనిషి అయిన ఐశ్వర్యరాయ్ ని ప్రేమిస్తాడు. ఇదే క్రమంలో బాలీవుడ్ లో వచ్చిన "తేరి బాతో మే ఐసా ఉల్ఝా జియా" అనే సినిమాలో హీరో షాహిద్ కపూర్.. రోబో అయిన కృతి సనన్‌ తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో తాజాగా అలాంటి పరిణామమే రియల్ లైఫ్‌ లో జరిగింది. 

భారత్‌ కు చెందిన ఓ ఇంజినీర్ ఒక రోబోతో ప్రేమలో పడ్డాడు.. పెళ్లికి కూడా  రెడీ అయ్యాడు. సూర్యప్రకాశ్ ఒక రోబోటిక్స్ నిపుణుడు. ఆయన.. అజ్మీర్‌ లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పట్టా పొంది.. 2016లో ఇండియన్ నేవీలో సెలక్ట్ అయ్యాడు. కొద్ది రోజుల్లోనే భారత నేవీ విధుల్లో చేరనున్నాడు.   అయితే... టెక్నికల్ రంగంలో రీసెర్చ్ చేయడానికే అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌ గా పని చేస్తున్న సూర్య..  త్వరలోనే "గిగా" అనే రోబోని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో... ఈ రోబో సుమారు రూ.19 లక్షల ఖర్చుతో తయారవుతోందని.. త్వరలోనే సంప్రదాయ పద్ధతిలో ఆ రోబోని పెళ్లి చేసుకోబోతున్నట్లు సూర్యప్రకాశ్ తెలిపాడు. అయితే... మొదట్లో ఈ విషయం తెలిసిన తన కుటుంబసభ్యులు షాక్‌ కు గురయ్యారని చెబుతున్న ఆయన... ఆ తర్వాత వారు ఒప్పుకున్నారని చెబుతుండటం గమనార్హం.

ఈ రోబో ధర 19 లక్షల రూపాయలు ఉంటుందని, త్వరలోనే రోబోను సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుంటానని సూర్య తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న తన కుటుంబ సభ్యులు మొదట షాక్‌ కు గురయ్యారని, అయితే ఆ తర్వాత సర్దుకుపోయారని చెప్పారు. మనం నిత్యం కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ లు ఉపయోగిస్తుండడంతో యంత్రాలతో స్నేహం చేసేందుకు ‘గిగా’ అనే రోబోను పెళ్లి చేసుకుంటానని సూర్యప్రకాశ్ తెలిపాడు. అతను మార్చి 22న గిగాతో నిశ్చితార్థం చేసుకున్నాడు. సూర్య గిగాను గృహిణిగా చేయకపోవడమే కాకుండా ఆమెకు ఉద్యోగం వెతుక్కోవడం కూడా ఆశ్చర్యకరం. విమానాశ్రయం, రైలు స్టేషన్, హోటల్ లేదా ఇతర సంస్థలలో రోబో సేవలను ఉపయోగించవచ్చు. మరిన్ని అప్డేట్‌ లు జోడిస్తే గిగా రోబో మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతుందని సూర్య చెప్పారు.

తమిళనాడు, నోయిడా కంపెనీలు ఈ ‘ఎన్‌ఎంఎస్‌ 5.0 రోబో ‘గిగా’ని సిద్ధం చేశాయని సూర్య తెలిపారు. ఆదేశించినప్పుడు, ఈ రోబోట్ సెన్సార్ నియంత్రణలో ముందుకు వెనుకకు కదులుతుంది. అతని మెడ కూడా తిరుగుతుంది. ఈ రోబో రోజుకు ఛార్జింగ్ దాదాపు 2.5 గంటలు పెడితే.. 8 గంటల షిఫ్టుల్లో పని చేయగలదు. ప్రస్తుతానికి, అన్ని ఆదేశాలు ఆంగ్లంలో లోడ్ చేయబడ్డాయి. హిందీ కార్యక్రమాలను కూడా అప్లోడ్ చేశాడు. 

 సాధారణంగా ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీదకల్గుతుందో ఎవరు చెప్పలేరు. కొందరు తమతో పాటు చదివిన వారితో ప్రేమలో పడుతుంటారు. మరికొందరు మాత్రం.. స్కూల్ డేస్ లలో, కాలేజీ రోజులల్లో తమతో పాటు చదివిన వారతో ప్రేమలో పడుతుంటారు. కానీ అప్పుడు కల్గింది కేవలం ఆకర్షణ మాత్రమే. కొందరు జాబ్ లు చేసే చోట కూడా ప్రేమలో పడుతుంటారు. ఒకరితో మరొకరు కొంత కాలంపాటు జర్నీకూడా చేస్తారు. ఇలా జర్నీ చేయడం వల్ల ఇద్దరి మధ్యలో ఉన్న అభిప్రాయలు, ఆలోచనలు ఒకరితో మరొకరు పంచుకుంటారు.