కశ్మీర్‌‌ను తలపిస్తున్న మన్యం

కశ్మీర్‌‌ను తలపిస్తున్న మన్యం

కొమురం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఆ ప్రాంతమంతా మరో కశ్మీర్‌‌ను తలపిస్తోంది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగజ్ నగర్, దహేగాం మండలాల్లోని గ్రామాల్లో కూడా హిమాలయాల మాదిరిగా పొగమంచు కురుస్తోంది. గ్రామాలన్నింటిని దట్టమైన పొంగమంచు పూర్తిగా కమ్మేసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రాంతంలో ఉదయం 9 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్మేసింది. కొత్తగూడెం - ఖమ్మం ప్రధాన రహదారిపై పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దారి కనిపించక కొంతమంది రోడ్డు పక్కనే వాహనాలు నిలిపివేశారు. కొత్తగూడెం సమీపంలోని గ్రామాలను సైతం పొగమంచు కమ్మేసింది. గత రెండు రోజులుగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గి చలి విజృంభిస్తోంది.