HCU పీజీ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య

HCU పీజీ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య

హైదరాబాద్: గచ్చిబౌలి లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పీజీ విధ్యార్ధిని మౌనిక ఆత్మహత్య చేసుకుంది. తాను నివాసం ఉంటున్న హాస్టల్ గదిలోనే ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె స్వస్థలం కరీంనగర్ జిల్లా  శ్రీరాంపుర్. 
మౌనిక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ నానో సైన్స్ కోర్సు రేండో సంవత్సరం చదువుతోంది. ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.