V6 News

సెంచరీ మిస్ చేసుకున్న ధావన్

సెంచరీ మిస్ చేసుకున్న ధావన్

పూణెలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డేలో ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చిన శిఖర్ ధావన్ అదరగొట్టాడు.106 బంతుల్లో 98 రన్స్ చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇందులో 11 ఫోర్లు,రెండు సిక్సులు ఉన్నాయి.  ఇండియా స్కోర్ 197 స్కోర్ వద్ద స్టోక్స్  బౌలింగ్ లో మోర్గాన్ కు  క్యాచ్ ఇచ్చిన ధావన్ ఔటయ్యాడు. ప్రస్తుతం ఇండియా 40 ఓవర్ల వద్ద 5 వికెట్లు కోల్పోయి 205 రన్స్ తో ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా ఉన్నారు. కోహ్లీ 56,రోహిత్ శర్మ 28, రాణించారు.