జూబ్లీ 800 పబ్ లో ఫైర్ యాక్సిడెంట్

జూబ్లీ 800 పబ్ లో ఫైర్ యాక్సిడెంట్

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో అగ్నిప్రమాదం  జరిగింది. జూబ్లీ 800 పబ్ లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. దట్టమైన పొగ, మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అగ్ని కీలలు భారీగా ఎగిసిపడటంతో పబ్  లోపలికి వెళ్లేందుకు సిబ్బందికి కష్టంగా మారింది. అద్దాలను ధ్వంసం చేసి అతికష్టం మీద మంటలను అర్పివేశారు. 

ఎనిమిది నెలల క్రితమే పబ్ మూత పడింది. ప్రస్తుతం భవనం ఖాళీ గా ఉంది.  వెల్డింగ్ వర్క్ నడుస్తుండగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. అగ్నికీలల ధాటికి ఫర్నీచర్, సంబంధిత ఏసీ సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఎంత నష్టం జరిగిందనే విషయంపై క్లారిటీ రాలేదు.