అభివృద్ధిని చూసే కాంగ్రెస్లోకి చేరికలు : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

అభివృద్ధిని చూసే కాంగ్రెస్లోకి చేరికలు : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

కరకగూడెం, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను చూసే పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రాళ్లవాగు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాయం సమక్షంలో కన్నాయిగూడెం సర్పంచ్​ కల్తీ విజయ్​తో పాటు పలువురు కాంగ్రెస్​ పార్టీలో చేరారు. అనంతరం సీఎంఆర్ఎఫ్​ లబ్ధిదారులకు రూ.11.27 లక్షలు విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అలాగే, కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత రాహుల్​గాంధీ పుట్టిన రోజు వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్​కట్​ చేసి శుభాకాంక్షలు తెలిపారు.