విదేశీ ప్రయాణాలపై సెస్,సర్ ఛార్జీలను విధించాలని కేంద్రం యోచిస్తోందని వస్తున్న వార్తలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తం..ఇందుల్లో రవ్వంత కూడా నిజం లేదు..విదేశీ ప్రయాణాలపై అలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తే లేదని..మా ప్రజల వ్యాపారం, జీవన సౌలభ్యం మెరుగుపర్చేందుకు మేం కట్టుబడి ఉన్నామని Xలో పోస్ట్ షేర్ చేశారు ప్రధాని.
విదేశీ ప్రయాణాలపై తాత్కాలిక సెస్ లేదా సర్‌చార్జ్ విధించే అవకాశంపై అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఒక మీడియా ప్రచారం చేసింది. నివేదిక ప్రకారం.. పశ్చిమాసియాలో యుద్దం కారణంగా పెరుగుతున్న ముడి చమురు, దిగుమతి ఖర్చులతో తలెత్తే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలిపారు. విదేశీ ప్రయాణాలపై విధించే ఏ సెస్, సర్‌చార్జ్ నేరుగా కేంద్రానికి వెళ్తుందని, ఇది ఒక తాత్కాలిక చర్యగా ఒక సంవత్సరం పాటు అమలులో ఉండవచ్చని ఆ రిపోర్టు పేర్కొంది. అయితే ఈ ప్రతిపాదనకు సంబంధించిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించలేదని కూడా ఆ రిపోర్టులో చెప్పారు.
ఇదిలా ఉంటే.. అమెరికా , ఇరాన్ యుద్దం కారణంగా తలెత్తిన ప్రపంచ ఇంధన సంక్షోభంతో విదేశీ మారక నిల్వలను తగ్గకుండా బంగారం కొనుగోలుకు దూరంగా ఉండాలని, ఏడాది పాటు అత్యవసరం కాని విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ.. మే 10న హైదరాబాద్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో పౌరులకు విజ్ఞప్తి చేశారు.
This is totally false.
— Narendra Modi (@narendramodi) May 15, 2026
Not an iota of truth in this.
There is no question of putting such restrictions on foreign travel.
We remain committed to improving ‘Ease of Doing Business’ and ‘Ease of Living’ for our people. https://t.co/9lxjbxz0nV
