- సెప్టెంబర్ 11, 12వ తేదీల్లో హైదరాబాద్ లో వేడుకలు
- 2019 సంవత్సరానికి ఉత్తమ నటీనటుల రేసులో వీరే
సినీ నటులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డుల ప్రదానోత్సవానికి ఈ ఏడాది హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే నెల 11 మరియు 12వ తేదీల్లో హైదరాబాద్ వేదికగా అవార్డుల ప్రదానోత్సవం జరపాలని సైమా నిర్ణయించింది. కరోనా వల్ల సైమా వేడుకలు రెండేళ్లుగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే చలనచిత్రరంగంలో మళ్లీ మునుపటి పరిస్థితులు నెలకొంటున్న నేపధ్యంలో సైమా అవార్డుల ప్రదానోత్సవానికి సన్నాహాలు చేస్తోంది.
ఉత్తమ నటీ నటులు వీరే
2019వ సంవత్సరానికి అవార్డులకు నామినేట్ అయిన నటీ, నటులు, దర్శకుల వివరాలను సైమా ప్రకటించింది. ఉత్తమ నటులకు పోటీపడుతున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. మహేష్ బాబు (మహర్షి), రామ్ (ఇస్మార్ట్ శంకర్), నాగ చైతన్య (మజిలీ), వరుణ్ తేజ్ (గద్దలకొండ), నాని (జెర్సీ), నవీన్ పొలిశెట్టి (ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ). అలాగే ఉత్తమ నటి విభాగంలో పోటీ పడుతున్న తారలు పూజా హెగ్డే(మహర్షి), సమంత (ఓ బేబీ), శ్రద్ధా శ్రీనాథ్ (జెర్సీ), రష్మిక (డియర్ కామ్రేడ్), రాశీఖన్నా (ప్రతిరోజు పండగే).
తెలుగు సినిమా నటీనటులే కాదు.. తమిళ, కన్నడ, మళయాళ భాషల సినిమాలకు సంబంధించిన నామినేషన్లను సైమా వెల్లడించింది. వాటినీ కింద ట్విట్టర్ లో చూసేయండి.
SIIMA 2019 Best Actor In A Leading Role Nominations | Telugu
— SIIMA (@siima) August 22, 2021
1: @urstrulyMahesh for Maharshi
2: @ramsayz for Ismart Shankar
3: @chay_akkineni for Majili
4: @IAmVarunTej for Gaddalakonda Ganesh
5: @NameisNani for Jersey
6: @NaveenPolishety for Agent Sai Srinivasa Athreya pic.twitter.com/MLKOEhmEXh