ఆయుష్‌‌‌‌లో 156 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఆయుష్‌‌‌‌లో 156  పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, వెలుగు: ఆయుష్  విభాగంలో 156 డాక్టర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆయుర్వేదం 54, హోమియో 33, యునాని 69 పోస్టులు ఉన్నాయి. 

వచ్చే నెల 7 నుంచి 22 వరకు https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm   బోర్డు వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోస్టుల వివరాలు, తదితర సమాచారం వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అందుబాటులో ఉంచారు.