తరతరాలుగా టీనేజర్లు ఉదయాన్నే నిద్రకళ్లతో స్కూల్ వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే, ఇది వారి తప్పు కాదని, వారి శరీరంలో జరిగే మార్పుల వల్ల వారు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతారని జ్యూరిచ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పరిశోధనలో ఏం తేలిందంటే :
స్విట్జర్లాండ్‌లోని 'గోస్సౌ' హైస్కూల్‌లో 14 ఏళ్ల వయస్సు ఉన్న 754 మంది విద్యార్థులపై ఈ అధ్యయనం చేశారు. ఈ స్కూల్‌లో విద్యార్థులకు ఒక వెసులుబాటు ఇచ్చారు. వారు కావాలనుకుంటే ఉదయాన్నే క్లాసులకు రావచ్చు లేదా కొంచెం ఆలస్యంగా రావచ్చు.
ఫలితాలు ఇలా ఉన్నాయి:
* దాదాపు 95% మంది విద్యార్థులు ఉదయం స్కూలుకు ఆలస్యంగా రావడానికే ఇష్టపడ్డారు.
ALSO READ : నష్టాల్లో క్లోజ్ అయిన మార్కెట్లు.. ఇన్వెస్టర్ల సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి
* స్కూలు సమయం మారడం వల్ల విద్యార్థులు రోజుకు అదనంగా 45 నిమిషాల పాటు ఎక్కువ నిద్రపోగలిగారు.
* ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి, అలసట తగ్గి ఉత్సాహంగా కనిపించారు. నిద్రలేకపోవడం వల్ల వచ్చే చిరాకు కూడా తగ్గింది.
* ఆశ్చర్యకరంగా, నిద్ర సరిగ్గా ఉండటం వల్ల విద్యార్థులు మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించారు. వారి ఏకాగ్రత కూడా పెరిగింది.
టీనేజర్ల బయోలాజికల్ క్లాక్ పెద్దల కంటే భిన్నంగా పనిచేస్తుంది. వారిని బలవంతంగా తెల్లవారుజామునే నిద్రలేపడం వల్ల వారి ఆరోగ్యం, చదువుపై చెడు ప్రభావం పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. టీనేజర్లకు కొంచెం ఎక్కువ నిద్ర సమయం ఇస్తే, వారు క్లాసులో చురుగ్గా ఉండటమే కాకుండా మానసిక ఆరోగ్యంగా ఉంటారు.
