తమిళనాడులో ఓటు వేసిన విదేశీయులు అరెస్టు.. ఎలా పట్టుకున్నారంటే..

తమిళనాడులో ఓటు వేసిన విదేశీయులు అరెస్టు.. ఎలా పట్టుకున్నారంటే..

తమిళనాడు ఎన్నికల్లో విదేశీయులు ఓటేశారు. ఎన్నికల అధికారుల కళ్లు గప్పి ఓట్లేయడం సంచలనంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత.. విదేశీయులు ఓటింగ్ పాల్గొన్నట్లు వచ్చిన సమచారంతో దర్యాప్తు జరిపిన ఇమ్మిగ్రేషన్ అధికారులు.. పది మందిని అరెస్టు చేశారు. గత ఎన్నికల్లో ఓట్లేసిన వారిని చెన్నై, మధురై విమానాశ్రయాలలో అరెస్టు చేశారు. 

పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఎక్కువగా శ్రీలంకకు చెందినవారే ఉన్నారు. విదేశీ వీసా ఉండి కూడా తమిళనాడులో ఎలా ఓట్లు వేశారనేది ప్రశ్నార్థంకంగా మారింది. అరెస్టైన 10 మందిలో.. రంజిని (59), సర్ఫుదీన్ (68), నీలాంతి (44), జయంతన్ (40), చార్లీ బాలచంద్రన్ (48), చక్రవర్తి లోగప్రియ (50), సునీత చక్రవర్తి (48) మొదలైన వారు శ్రీలకం పౌరులు. వీరితో పాటు  బ్రిటన్‌కు చెందిన అయ్యదురై (53), ఇండోనేషియాకు చెందిన టిటిన్ మరియాట్టి (47), కెనడాకు చెందిన జిత్తేంద్రనాథ్ (38) అరెస్టైన వారి లిస్టులో ఉన్నారు.

ఎలా పట్టుకున్నారంటే..

చెన్నై, మధురై ఎయిర్ పోర్టులలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండియా నుంచి విదేశాలకు వెళ్తున్న క్రమంలో.. వారి చూపుడు వేలుకు ఇంకు గుర్తు ఉండటం గమనించారు. విదేశాల వీసా కలిగి ఉండి.. ఇంకు మార్కు గుర్తులు ఉండటమేంటనే అనుమానంతో విచారించారు. దీంతో వాళ్లు మొన్నటి ఎన్నికల్లో ఓటేసినట్లు ఒప్పుకున్నారు. 

శ్రీలకం వీసాతో వచ్చిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డులు ఉండటం గమనార్హం. విదేశీయులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం చట్టవిరుద్ధంగా నేరమని.. జారీ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అయితే మొటి అరెస్టు మంగళవారం (మే 12) చేసినట్లు పోలీసులు తెలిపారు. 

SIR సరిగ్గా జరగటం లేదా.?

విదేశీయులు ఓటు వేశారనే అంశం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కారణంగా లక్షల ఓట్లు తొలగించారు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ విదేశీ ఓటర్లు ఎలా ఓట్లు వేశారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం తమిళనాడులో 74 లక్షల పేరర్లను తొలగించారు. దాదాపు 28 క్షల కొత్త ఓటర్లను యాడ్ చేశారు. 

ఒకవైపు SIR  పూర్తయ్యాక కూడా విదేశీయులు ఎలా ఓట్లేశారని ప్రశ్నిస్తున్నారు. ఓటర్ లిస్టులో పేర్లు ఉంటే.. ఎన్నికల అధికారులు తొలగించలేదా అని ప్రశ్నిస్తున్నారు. అంటే సర్ ప్రక్రియ సరిగ్గా జరగటం లేదా అనే ప్రశ్నలు లేవనెత్తున్నారు.