కరోనాపై పోరుకు ఫండ్‌ రైజింగ్‌ చేస్తున్న 103 ఏళ్ల వృద్ధుడు

కరోనాపై పోరుకు ఫండ్‌ రైజింగ్‌ చేస్తున్న 103 ఏళ్ల వృద్ధుడు
  • 42 కి.మీ. మారథాన్‌ స్టార్ట్‌ చేసిన మాజీ డాక్టర్‌‌

బెల్జియం: కంటికి కనిపించని కరోనా మహమ్మారితో ప్రపంచం అంతా పోరాడుతోంది. వ్యాక్సిన్‌ వస్తే తప్ప వ్యాధిని కంట్రోల్‌ చేయలేని పరిస్థితి తయారైంది. కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు ప్రపంచం మొత్తం ఎన్నో ప్రయోగాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ కనుగొనేందుకు సాయం చేయాలనుకున్న బెల్జియంకు చెందిన 103ఏళ్ల మాజీ డాక్టర్‌‌ అల్ఫోన్స్‌ లిమ్‌పోల్స్‌ మారథాన్‌ చేసి ఫండ్‌ రైజ్‌ చేస్తున్నారు. బ్రెసెల్స్‌లోని మున్సిపాలిటీ ఆఫ్‌ రోట్‌సిల్లార్‌ నుంచి తన జర్నీ స్టార్ట్‌ చేశారు. దాదాపు 42.2 కిలోమీటర్లు నడుస్తున్నట్లు ప్రకటించారు. ‌ ఈ నెల 1న స్టార్ట్‌ అయిన ఈ మారథాన్‌ను 30 వరకు కొనసాగిస్తానని చెప్పారు. బ్రిటన్‌లో హీరోగా సెంటనేరియన్‌ను చూసి స్ఫూర్తి పొందానని అందుకే ఈ ప్రయత్నం స్టార్ట్‌ చేశానని ఆయన అన్నారు. ‘నేను నడవగలనని నా పిల్లలు చెప్పారు’ అని అల్ఫోన్స్‌ అన్నారు. అల్ఫోన్స్‌ ఇప్పటి వరకు రూ.5,16,600 సంపాదించినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. వ్యాక్సిన్‌ కనుగొనేందుకు తన వంతు సాయం చేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నాని ఆయన అన్నారు. ఒక డాక్టర్‌‌గా నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఈ మారథాన్‌ స్టార్ట్‌ చేశాను అని అల్ఫోన్స్‌ చెప్పారు.