మనోళ్లు 13 మందికి పోలీస్ మెడల్స్

మనోళ్లు 13 మందికి పోలీస్ మెడల్స్

హైదరాబాద్, వెలుగు: డ్యూటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర పోలీసులకు అవార్డుల దక్కాయి. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర హోం శాఖ అందిస్తున్న ప్రెసిడెంట్, ఇండియన్ పోలీస్ మెడల్స్ కి రాష్ట్రం నుంచి 13 మంది పోలీసులు ఎంపికయ్యారు. సెలెక్షన్ కి సంబంధించిన అవార్డీస్ లిస్ట్ ను కేంద్రహోంశాఖ శనివారం రాష్ట్ర డీజీపీ ఆఫీస్ కు పంపింది. ఇందులో అడిషనల్ డీజీ(పర్సనల్) బి.శివధర్ రెడ్డి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ను అందుకోనున్నారు. కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ పై వెళ్లిన అకున్ సబర్వాల్ తోపాటు మరో 11 మంది పోలీసులు ఇండియన్ పోలీస్ మెడల్స్ కు ఎంపికయ్యారు. ఫైర్ సర్వీస్ కు సంబంధించి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజ్​కుమార్, ఫైర్ మెన్ భాస్కర్ రావు కమటాలకు మెడల్స్ దక్కాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్ స్పెక్టర్ చక్రవర్తిని పోలీస్ మెరిటోరియస్
అవార్డులు వరించాయి.

ప్రెసిడెంట్ పోలీస్ మెడల్

బి.శివధర్ రెడ్డి                         అడిషనల్ డీజీ(పర్సనల్)

ఇండియన్ పోలీస్ మెడల్        

అకున్ సబర్వాల్                     సెంట్రల్ సర్వీస్(డిప్యుటేషన్)

ఆర్.వేణుగోపాల్                      కమాండెంట్, 2వ బెటాలియన్, అదిలాబాద్

ఎండీ ఇక్బాల్ సిద్దిఖీ                అడిషనల్ డీసీపీ, ఎస్బీ,హైదరాబాద్

పి.సత్యనారాయణ                   అడిషనల్ కమాండెంట్, 10వ బెటాలియన్,
బీచ్ పల్లి, మహబూబ్ నగర్

దేవనబోయిన ప్రతాప్               ఏసీపీ,టాస్క్ ఫోర్స్, నిజామాబాద్

గంటా వెంకటరావు                  ఏసీపీ, ఖమ్మం టౌన్

సామ జయరాం                       డీఎస్పీ, నల్గొండ విజిలెన్స్

శ్రీరంగం రవీంద్రనాథ్                 రిజర్వ్ ఇన్ స్పెక్టర్, టీఎస్ఎస్పీ, కొండాపూర్

కె.సుధాకర్                             ఏఎస్ఐ, వరంగల్

ఎం.నాగలక్ష్మి                          ఏఎస్ఐ, పోలీస్ అకాడమీ

ఆర్. అంతిరెడ్డి                         ఏఎస్ఐ, ఎస్ఓటీ, శంషాబాద్

డి.రమేశ్ బాబు                       సీనియర్ కమాండో, గ్రేహౌండ్స్, పుప్పాలగూడ