మీ ఐఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచాలంటే..ఎక్కువకాలం ఛార్జింగ్ ఉండాలంటే ఇలా చేయండి

మీ ఐఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచాలంటే..ఎక్కువకాలం ఛార్జింగ్ ఉండాలంటే ఇలా చేయండి

మీ ఐఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుందా?...పదేపదే ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుందా..? అయితే యాపిల్ సంస్థ మీకు కొన్ని సలహాలు సూచనలు చేస్తోంది. వినియోగదారులకు వారి iPhone బ్యాటరీని ఎక్కువకాలం ఛార్జింగ్ ఉండేలా, మీ డివైజ్ బ్యాటరీలైఫ్ పెంచేలా యాపిల్ ఐదు కీలక చిట్కాలను అందిస్తుంది.  అవేంటో చూద్దాం..

మీ ఐఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుందా..? దీనికి కారణం మీరు ఐఫోన్ వినియోగించే విధానమే కావచ్చు. బ్యాటరీ లైఫ్, బ్యాటరీ పనితీరుపై దృష్టి సారించడం ద్వారా మీ ఐఫోన్ బ్యాటరీ పనితీరును ఆప్టిమైజ్ చేయవచ్చని Apple  చెపుతుతంది.  

మీ iPhone బ్యాటరీని ఆప్టిమైజ్ చేయడానికి కొన్ని చిట్కాలు 

మీ ఐఫోన్ తాజా iOS వెర్షన్‌కు అప్ డేట్ చేయడం చాలాముఖ్యం. అప్‌డేట్‌లు కొత్త ఫీచర్‌లను పరిచయం చేయడమే కాకుండా బ్యాటరీ పనితీరును ప్రభావితం చేసే ముఖ్యమైన పరిష్కారాలను కూడా కలిగి ఉంటాయి. తాజా iOS వెర్షన్‌తో మీ iPhoneని క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడం ద్వారా  మీరు బ్యాటరీ లైఫ్, డివైజ్ సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేయొచ్చు. ఈ ప్రయోజనాన్ని పొందడానికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో తాజాగా ఉండాలని Apple సిఫార్సు చేస్తోంది.

ఛార్జింగ్ చేస్తున్నపుడు మీ ఐఫోన్ కేస్ ని తీసివేయండి:

కొన్ని ఐఫోన్ కేస్ లు ఛార్జింగ్ సమయంలో వేడిని ట్రాప్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది బ్యాటరీ కండిషన్ ను ప్రభావితం చేస్తుంది. ఛార్జింగ్ చేస్తున్నప్పుడు మీ డివైజ్ వేడిగా మారినట్లు గుర్తిస్తే వెంటనే ఆ కేస్ నుంచి తీసివేయాలి. తద్వారా బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడొచ్చు. బ్యాటరీ లైఫ్ పెంచొచ్చు. 

ఉపయోగంలో లేనప్పుడు బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవద్దు:

మీరు మీ ఐఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించాల్సిన అవసరం లేకపోతే, బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవద్దు. దీన్ని 50 శాతం వరకు మాత్రమే ఛార్జ్ చేయండి. ఐఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేసి పూర్తిగా డిశ్చార్జ్ చేయడం కూడా మంచిది కాదు. మీరు ఫోన్‌ని ఉపయోగించకూడదనుకుంటే దానిని గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఉంచండి.

ఫోన్ ఉష్ణోగ్రత:

Apple తన iPhoneని 16°-22°C మధ్య ఉపయోగించేలా డిజైన్ చేసింది. ఉష్ణోగ్రత 35 °C మించి ఉంటే బ్యాటరీ లైఫ్ క్షీణిస్తుంది. కొన్నిసార్లు ఐఫోన్ ఛార్జ్ చేయడానికి నిరాకరిస్తుంది. అయినప్పటికీ, విపరీతమైన చలిలో ఐఫోన్ ను  ఉపయోగించడం కూడా దాని లైఫ్ ను తగ్గిస్తుంది. ఫోన్ చాలా వేడిగా ఉన్నప్పుడు ఫ్రీజ్ చేయవద్దు. దానిని దూరంగా ఉంచడం మంచిది. 

లోపవర్ మోడ్‌ని ఆన్ చేయాలి:

Apple iOS 9తో లోపవర్ మోడ్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ బ్యాటరీ లైఫ్ ను ఆదా చేయడంలో, బ్రైట్ నెస్ తగ్గించడం, యానిమేషన్లను తగ్గించడం, మీ బ్యాటరీ 20 శాతం నుంచి 10 శాతానికి చేరినప్పుడు లోపవర్ మోడ్ యాక్టివేట్ చేయాలి. దీనికోసం సెట్టింగ్ > బ్యాటరీ లోపవర్ మోడ్ ను మాన్యువల్ గా యాక్టివేట్ చేయాలి. అయితే ఈ సమయంలో మెయిల్ రావు.. iCloud వంటివి నిలిపివేయబడతాయి. ఈ ఫీచర్‌ని ఆన్ చేసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ ఆగిపోతుంది.