తిరుమల వైకుంఠ ద్వార దర్శనం పేరుతో.... హైదరాబాద్లో ఈ మహిళ ఎలా మోసం చేసిందో చూడండి

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం పేరుతో.... హైదరాబాద్లో ఈ మహిళ ఎలా మోసం చేసిందో చూడండి

సంక్రాంతి సెలవులు కావడంతో తిరుమల దేవస్థానానికి భక్తుల రద్దీ  ఎక్కువగా ఉంటుంది. దర్శనం కోసం కాస్త కష్టపడాల్సిన పరిస్థితి. ఈ సిచువేషన్ ను దృష్టిలో ఉంచుకుని క్యాష్ చేసుకోవాలనుకుంది ఓ మహిళ. హైదరాబాద్ లో వైకుంఠ ద్వార దర్శనం సేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి భక్తుల నుంచి లక్షల్లో వసూలు చేసింది. బాధితుల ఫిర్యాదుతో కేసు వెలుగులోకి వచ్చింది. 

సికింద్రాబాద్ పరిధిలో జరిగింది ఈ ఘటన. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం సేవా టికెట్లు చేయిస్తానని మోసం చేసిన మహిళను మమతగా గుర్తించారు. సుమారు 100 నుంచి 150 మంది భక్తుల దగ్గర డబ్బులు వసులు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ఫిర్యాదు మేరకు మమతపై కేసు నమోదు చేశారు సికింద్రాబాద్ మహంకాళి స్టేషన్ పోలీసులు. 

►ALSO READ | జనవరి 14 భోగి పండుగ.. షట్ తిల ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలి.. ఏదేవుడిని పూజించాలి..!

టికెట్ల పేరున భక్తుల నుంచి 15 వందల నుంచి 3 వేల రూపాయలు వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. టికెట్ల విషయంలో మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా భక్తులను హెచ్చరించారు పోలీసులు.