హిందువులు ఏకాదశి రోజుకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. పుష్యమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని షట్ తిల ఏకాదశి అంటారు. ఈ ఏడాది షట్ తిల ఏకాదశి భోగి పండుగ రోజు జనవరి 14 న వచ్చింది. షట్ తిల ఏకాదశి ప్రాముఖ్యత .. విశిష్టత గురించి తెలుసుకుందాం..
షట్ తిల ఏకాదశి2026 జనవరి 14 రోజున ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించాలి. షట్ అంటే ఆరు...తిల అంటే నువ్వులు.. ఈ ఏకాదశి రోజున నువ్వులను ఆరు విధాలుగా పూజిస్తే విశేష ఫలితాలు పొందుతారని పురాణాల ద్వారా తెలుస్తుంది.
ధ్రుక్ పంచాంగం ప్రకారం 2026 జనవరిలో షట్తిల ఏకాదశి తిథి జనవరి 13 సాయంత్రం 3 గంటల 18 నిమిషాల నుంచి ఈ ఏకాదశి తిథి ప్రారంభమై జనవరి 14 సాయంత్రం 5 గంటల 53 నిమిషాల వరకు కొనసాగుతుంది. కావున ఈ పండుగను ఉదయ తిథి ప్రకారం జనవరి 14న జరుపుకోవాలి. భోగి పండుగ మరియు ఏకాదశి ఒకే రోజున కలసి రావడం చాలా అరుదైన సంఘటనగా పండితులు చెబుతున్నారు..
షట్ తిల ఏకాదశి పూజా విధానం
జనవరి 14 వ తేది సూర్యోదయానికి ముందే నిద్ర లేచేటప్పుడు విష్ణుమూర్తిని స్మరించుకోవాలి. తరువాత కాలకృత్యాలు తీసుకుని నలుగుపిండితో స్నాం చేయాలి. నువ్వుల నూనెను శరీరానికి రాసుకొని, నువ్వులు వేసిన నీటితో స్నానం చేయాలి. నువ్వులను పేస్ట్ చేసి శరీరానికి రాసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ( జనవరి 15) విరమించాలి.
పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని .. పసుపు.. కుంకుమ.. బియ్యపు పిండితో అలంకరించుకోవాలి. పీట .. బల్ల కాని అక్కడ ఉంచి.. దానిని కూడా అలంకారం చేయాలి. దానిపై క్లాత్ వేసి.. విష్ణుమూర్తి చిత్రపటాన్ని కాని విగ్రహాన్ని కాని ప్రతిష్ఠించకోవాలి.
►ALSO READ | సంక్రాంతి పెద్దల పండుగ.. పితృ దేవతలు తృప్తి కోసం తర్పణాలు వదలాల్సిన రోజు ఇదే..
లక్ష్మీ నారాయణులను అర్చించి .. విష్ణుమూర్తిని పంచామృతాలతో అభిషేకం చేయాలి. షోడశోపచార పూజ చేసి.. విష్ణుమూర్తి .. లక్ష్మీ దేవి అష్టోత్తరాలు చదువుతూ తులసి ఆకులు.. పూలు.. అక్షింతలతో పూజ చేయాలి. లక్ష్మీ దేవి అష్టోత్తం చదివేటప్పుడు కుంకుమతో అర్చించాలి. ధూపం (అగరబత్తులు), దీపం (నెయ్యి దీపం) నైవేద్యం (పండ్లు, నువ్వులతో చేసిన పదార్థాలు), నువ్వులు, వస్త్రం, తాంబూలం సమర్పించాలి. తరువాత బ్రాహ్మణులను ఇంటికి ఆహ్వానించి.. విష్ణుమూర్తి స్వరూపంగా భావించి.. దక్షిణ .. తాంబూలం ఇచ్చి వస్త్ర దానం చేయాలి. స్వయం పాకం ఇవ్వాలి. ఆ రోజంతా ( జనవరి 25) భగవంతుని ధ్యానిస్తూ గడపాలి. ఎవరిని దుర్భాషలాడరాదు. అబద్దాలు ఆడకూడదు..
ఈ ఏడాది షట్ తిల ఏకాదశి భోగి పండుగ రోజు వచ్చింది. భోగి పండుగ అమ్మవారికి విష్ణుమూర్తికి ఎంత ప్రీతో... ఏకాదశి తిథి విష్ణు భగవానుడికి అంత ఇష్టం. వారిని యథావిథిగా పూజించి.. నువ్వులను దానం చేయడం వలన పితృదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. నువ్వులతో హోమం చేయాలి. పితృ దేవతలకు నువ్వులు కలిపిన నీటిని సమర్పించాలి. నువ్వులు కలిపిన అన్నాన్ని భుజించాలి. ఉపవాసం ఉండేవారు నువ్వులు కలిపిన ఆహారాన్ని స్వామికి నివేదించి.. కళ్లకు అద్దుకొని పక్కన పెట్టి..మరుసటి రోజు తినాలి.
షట్ తిల ఏకాదశి కథ
త్రేతా యుగంలో ఓ మహిళ ఎవరు ఏది అడిగినా లేదనకుండా విరాళాలు ఇచ్చేది. కాని పేదలకు ఆహారం మాత్రం ఇచ్చేది కాదు. ఎవరైనా అన్నం పెట్టమని అడిగినా పెట్టేది కాదు. ధనం.. వస్త్రం ఇలా అన్ని ఇచ్చేది కాదు. అయితే ఆమెకు అన్నం పరబ్రహ్మ స్వరూపం... అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అనే విషయాన్ని తెలియజేసేందుకు శ్రీకృష్ణుడు బిచ్చగాడి వేషంలో ఆహారం కోసం ఆమె వద్దకు వచ్చాడు. ఆమె నిరాకరించింది .. అతనిని అవమానించింది. ఎంతసేపటికి శ్రీకృష్ణుడు అక్కడ నుంచి కదలకపోవడంతో ఆ మహిళ అతని గిన్నెలో ఒక మట్టిని వేసింది. అప్పుడు ఆమె ఇంటిలోకి వెళ్లి చూడగా ఆహారమంతా మట్టిగా మారింది. ఏది చూసిన మట్టిగా మారింది. ఇలా కొన్నాళ్లకు ఆమె ఆరోగ్యం క్షిణించింది.
►ALSO READ | Sankranti 2026 : సంక్రాంతి పెద్ద పండుగ .. ఇండియాలో ఎక్కడ ఎలా జరుపుకుంటారు..! ప్రాధాన్యత.. విశిష్టత ఇదే..!
ఇలా కొంతకాలం గడచిన తరువాత పుష్యమాసం కృష్ణ పక్షం ఏకాదశిరోజు శ్రీకృష్ణుడు ఆమె కలలో కనిపించి, ఆమె చేసిన తప్పును గుర్తు చేస్తూ, షట్తిల ఏకాదశి నాడు పేదలకు అన్నదానం చేయమని సలహా ఇచ్చాడు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో కఠినమైన ఉపవాసం పాటించాలని ఆమెకు మార్గనిర్దేశం చేశాడు. శ్రీకృష్ణుని సలహాను అనుసరించి, స్త్రీ ఉదారంగా దానం చేసి షట్తిల ఏకాదశి నాడు ఉపవాసం చేసింది. ఫలితంగా, ఆమె తన సంపద, ఆరోగ్యం మరియు ఆనందాన్ని తిరిగి పొందింది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
