సీఎంఆర్‌‌ వడ్లు పక్కదారి... నల్గొండ లో 7 మిల్లుల పై కేసులు, ఇద్దరు మిల్లర్లు అరెస్ట్

సీఎంఆర్‌‌ వడ్లు పక్కదారి... నల్గొండ లో 7 మిల్లుల పై కేసులు, ఇద్దరు మిల్లర్లు అరెస్ట్
  •     మిల్లులపై కేసులు నమోదు చేయనున్న అధికారులు  
  •     సూర్యాపేట జిల్లాలో సైతం మిల్లర్లపై కేసులు పెట్టనున్న సివిల్ సప్లయ్ శాఖ అధికారులు 

నల్గొండ, వెలుగు: సీఎంఆర్ రైస్ మిల్లర్లకు​ అందించాల్సిన  రైస్​ మిల్లర్ల బకాయిలు పెరగడంతో ప్రభుత్వం నోటీసులు ఇచ్చి క్రిమినల్​ కేసులు పెడుతోంది. బకాయిలు రూ. కోట్లల్లో  పైగా పేరుకుపోవడంతో మిల్లర్లపై సివిల్​ సప్లై అధికారులు ఆర్​ఆర్​ యాక్ట్​ కింద కేసులు నమోదు చేస్తున్నారు.  సీఎంఆర్​ బకాయిపడిన మిల్లర్లపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోంది. 

సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున మిల్లర్లూ సీఎంఆర్ వడ్లను పక్కదారి పట్టించగా సివిల్ ​సప్లై అధికారులు తయారు చేసిన సీఎంఆర్​ బకాయి లిస్ట్​లో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా టాప్ లో ఉంది. ఈ క్రమంలో నల్గొండ జిల్లాలో కేసులు నమోదు చేసిన విదంగానే సూర్యాపేట జిల్లాలో సైతం కేసులు పెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. 

బకాయి ఉన్న మిల్లులపై కేసులు 

జిల్లాలో మిల్లర్ల తీరుపై విమర్శలు వస్తున్నా కొన్నేళ్లుగా అధికారులు మౌన పాత్ర వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా మిల్లులో సీఎంఆర్ గుట్టలుగా పేరుకుపోయినా చర్యలు తీసుకోకపోవడంతో పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2014  నుంచి 2023 వరకు సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల పై గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా 2022 - 23 రబీ సీజన్ సంబందించిన టెండర్ వడ్లను మిల్లర్లూ అటు ప్రభుత్వానికి అందించకుండా ఇటు టెండర్ దారులకు అందించకుండా అమ్ముకున్నారన్న విమర్శలు ఉన్నాయి. 

గతేడాది డిసెంబర్ నెలలో పెండింగ్ సీఏంఆర్ 30 రోజుల్లో ఎఫ్సిఐ కి అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.  సూర్యాపేట జిల్లాలో 2014 సీజన్ నుండి 2023 వరకు సీజన్ వరకు దాదాపు 20 వరకు మిల్లులు బకాయిలు ఉండగా 2022 - 23 సీజన్ సంబందించి 11 మిల్లుల వద్ద 2,39,600మెట్రిక్ టన్నుల వడ్లు బకాయి ఉన్నాయి. ఈ క్రమంలో ఎక్కువ బకాయిలు ఉన్న ఆరు మిల్లుల పై కేసులు పెట్టేందుకు రంగం సిద్దం చేస్తుండగా మరి కొన్ని మిల్లులపై సైతం కేసులు పెట్టేందుకు సైతం సివిల్ సప్లయ్ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

నల్గొండ జిల్లాలోని మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ 

సీఎమ్మార్ ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా మాయం చేసిన 7మిల్లులపై సోమవారం కేసులు నమోదు చేశారు..నల్గొండ జిల్లాలో 2022- 23 రబీ సంబంధించిన సీఎమ్మార్ ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో మిల్లులలో తనిఖీలు చేయగా 7మిల్లులలో రూ.191కోట్ల విలువ గల  58,594మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. దీనితో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశాలతో కేసు నమోదు చేసి ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించి వారి ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో కొంతమంది మిల్లర్లను అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారీలో ఉన్నారు. 

2022 - 23 - - రబీ సీజన్‌ సంబందించి సుమాంజలి పారా బాయిల్డ్, వరలక్ష్మి పారా బాయిల్డ్ మిల్, చిట్యాల  మనోహర ఆగ్రో ఫుడ్ ప్రాడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్  రైస్ మిల్లుల ద్వారా మొత్తం 13,170.061 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సుమారు రూ.43 కోట్ల నష్టం కలిగించినట్లు విచారణలో వెల్లడైంది.వీటిలో  సుమాంజలి మిల్ సుమారు రూ.22 కోట్ల నష్టం, వరలక్ష్మి మిల్ రూ.19.33 కోట్లు, మనోహర మిల్ రూ.1.47 కోట్ల విలువైన వడ్లను అమ్ముకున్నారు. వీరిలో కందుకూరి మహేందర్, కందుకూరి పద్మలను అదుపులోకి తీసుకొని తీసుకొని రిమాండ్ కు తరలించారు.