సంక్రాంతి పెద్దల పండుగ.. పితృ దేవతలు తృప్తి కోసం తర్పణాలు వదలాల్సిన రోజు ఇదే..

సంక్రాంతి పెద్దల పండుగ..    పితృ దేవతలు తృప్తి కోసం తర్పణాలు వదలాల్సిన రోజు ఇదే..

మకర సంక్రాంతి హిందువులకు పెద్ద పండుగ.  ఈ రోజు ( 2026 జనవరి 15) పితృ దేవతలను పూజించాలని పండితులు చెబుతున్నారు.  సూర్యుడు వెలుగులో పితృదేవతలు వారి వారసులు ఉండే ప్రదేశానికివస్తారని.. వారు ఇచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తారని పురాణాల ద్వారా తెలుస్తుంది.  అందుకే ఆ రోజు కచ్చితంగా పితృ దేవతలకు తర్పణాలు వదిలి.. పేదలకు అన్నదానం చేయాలి.  అలాగే స్వయం పాకం ఇవ్వాలని చెబుతున్నారు. 

పురాణాల ప్రకారం మకర సంక్రాంతి  రోజున ఏ దైవాన్ని పూజించినా, యజ్ఞం చేసినా విశేష ఫలితం ఉంటుందని నమ్ముతారు. సంక్రాంతి రోజున పితృదేవతల ప్రీతి కోసం తర్పణాలు వదులుతారు.
సంక్రాంతి రోజు సూర్యుడు మకరరాశిలోకి అడుగుపెడతాడు. మకర రాశికి శని అధిష్టాన దేవత. వరుసల ప్రకారం సూర్యుడు, శని తండ్రీకొడుకులు. అయితే వాళ్లిద్దరికి అసలు పడదు. కానీ ఈ పండుగరోజు కలుస్తారు.  

 సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఈ రోజును పవిత్ర పుణ్య దినంగా భావిస్తారు. ఈ పుణ్య ఘడియలు ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు ఉంటాయి.   అంటే అప్పటి వరకు ఉత్తరాయణ పుణ్యకాలం కొనసాగుతుంది.సంక్రాంతిలో సం... అంటే...  చేరుకోవడం...  క్రాంతి అంటే ...వెలుగు, అభివృద్ధి అని రెండు అర్థాలు ఉన్నాయి.

మకర సంక్రాంతిని పంటకోతల పండుగ.... కుప్ప నూర్పిడుల పండుగ అని కూడా పిలుస్తారు. పంట ఇంటికి వచ్చిన తర్వాత, మళ్లీ కొత్త పంట వేయడానికి కావాల్సిన వాటిని సిద్ధం చేసుకోవాలన్న సోయి కూడా ఈ పండుగలో ఉందని .  . సంక్రాంతి పండుగ అంటే వెలుగును ఆహ్వానించడమేనని పెద్దలు చెబుతున్నారు

ఈ పండుగకు సూర్యుడికి సంబంధం ఉంది. పురాణాల ప్రకారం సూర్యుడు ఇంద్ర, వరుణ, వాయుదేవతల సాయంతో వర్షాలు కురిపిస్తాడు. అందుకే ఈ రోజు పొంగలిని సూర్యుడికి నై వేద్యంగా పెడతారు. నీళ్లను సూర్యుడికి నివేదన కూడా ఇస్తారు. 

►ALSO READ | Sankranti 2026 : సంక్రాంతి పెద్ద పండుగ .. ఇండియాలో ఎక్కడ ఎలా జరుపుకుంటారు..! ప్రాధాన్యత.. విశిష్టత ఇదే..!

సంక్రాంతి  రోజు కొత్త కుండలో పాలు పొంగించి, కొత్త బియ్యం, కొత్త బెల్లంతో పొంగలి వండుతారు. మకరరాశికి అధిపతి శని. అందుకే ఈ రోజు శనికి ప్రీతికరమైన నల్లనువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలు, గుమ్మడికాయలు దానం చేస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యం, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం. నువ్వులు, బెల్లం తినడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.  అందుకే ఈ రెండు పదార్ధాతో చేసిన అరిసెలు ఓ నెల రోజుల వరకు ఉంటాయి. 

మకర సంక్రాంతిని పంటకోతల పండుగ.... కుప్ప నూర్పిడుల పండుగ అని కూడా పిలుస్తారు. పంట ఇంటికి వచ్చిన తర్వాత, మళ్లీ కొత్త పంట వేయడానికి కావాల్సిన వాటిని సిద్ధం చేసుకోవాలన్న సోయి కూడా ఈ పండుగలో ఉందని పెద్దలు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.