ముంబై: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ స్నేహ్ రాణా చెత్త రికార్డ్ నమోదు చేసింది. డబ్ల్యూపీఎల్‌లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు (32) సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచింది. డబ్ల్యూపీఎల్ సీజన్ 4లో భాగంగా ఆదివారం (జనవరి 11) నవీ ముంబైలోని డాక్టర్ DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ తలపడ్డాయి.
గుజరాత్ ఇన్సింగ్స్ సమయంలో ఆరో ఓవర్ వేసిన స్నేహ్ రాణా జీజీ బ్యాటర్ సోఫీ డివైన్ ధాటికి భారీగా పరుగులు సమర్పించుకుంది. ఈ ఓవర్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో ఊచకోత కోసిన డివైన్ 32 పరుగులు పిండుకుంది. తద్వారా డబ్ల్యూపీఎల్ లో ఒకే ఓవర్లో అత్యధిక (32) రన్స్ ఇచ్చిన చెత్త రికార్డును స్నేహ్ రాణా తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు ఈ రికార్డ్ టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ పేరిట ఉండేది.
►ALSO READ | IND vs NZ: జెమీసన్ టెన్షన్ పెట్టినా కోహ్లీ గెలిపించాడు.. న్యూజిలాండ్‌పై తొలి వన్డేలో టీమిండియా విజయం
డబ్ల్యూపీఎల్ సీజన్ 3లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై దీప్తి శర్మ 28 పరుగులు ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. సోఫీ డివైన్ (95) తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా.. యాష్లే గార్డనర్ (49) రాణించింది. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ 5 వికెట్లు పడగొట్టగా.. చినెల్లే హెన్రీ, శ్రీచరణి చెరో రెండు వికెట్లు తీశారు. షఫాలీ వర్మ ఒక వికెట్ సాధించింది. అనంతరం ఢిల్లీ 210 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగింది.
