న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. ఆదివారం (జనవరి 11) వడోదర వేదికగా ముగిసిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బౌలర్లు అంచనాలకు తగ్గట్టు రాణించకపోయినా బ్యాటర్లు దుమ్ములేపి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఛేజింగ్ లో విరాట్ కోహ్లీ (93) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడంతో పాటు కెప్టెన్ గిల్ (56) హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఇండియా 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసి గెలిచింది.
కోహ్లీ, గిల్ కీలక భాగస్వామ్యం:
301 పరుగుల టార్గెట్ ఛేజింగ్ లో ఇండియాకు అనుకున్న ఆరంభం రాలేదు. ఆరంభంలో గిల్ తడబడినా రోహిత్ కొన్ని బౌండరీలు బాది ఇన్నింగ్స్ కు ఊపు తీసుకొని వచ్చాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 39 పరుగులు జోడించిన తర్వాత 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఔటయ్యాడు. ఈ దశలో గిల్ కు జత కలిసిన కోహ్లీ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. కోహ్లీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. గిల్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో స్కోర్ బోర్డు పరుగులు పట్టింది. హాఫ్ సెంచరీ చేసుకున్న గిల్ కవర్స్ లో క్యాచ్ ఇచ్చి 56 పరుగుల వద్ద ఔటయ్యాడు. రెండో వికెట్ కు కోహ్లీ గిల్ 118 పరుగులు జోడించడం విశేషం.
టెన్షన్ పెట్టిన జెమీసన్
గిల్ ఔటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్ తో కలిసిన కోహ్లీ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మూడో వికెట్ కు 77 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. విజయం ఈజీ అనుకున్న సమయంలో కివీస్ పేసర్ జెమీసన్ తన బౌలింగ్ తో టీమిండియాను టెన్షల్ పెట్టాడు. సెంచరీకి చేరువలో ఉన్న కోహ్లీ (93) తో పాటు జడేజా (4)ను ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. అంతేకాదు తన తర్వాత ఓవర్లో అయ్యర్ (49)ను క్లీన్ బౌల్డ్ చేసి కష్టాల్లో పడేసాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు హర్షిత్ రాణా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లోనే 29 పరుగులు చేసి ఒత్తిడి తగ్గించాడు. చివర్లో సుందర్ తో కలిసి రాహుల్ (29) జాగ్రత్తగా ఆడుతూ మ్యాచ్ ఫినిష్ చేశాడు.
న్యూజిలాండ్ భారీ స్కోర్:
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.
ఓపెనర్లు హెన్రీ నికోల్స్, డేవాన్ కాన్వే అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 117 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోర్ కు బాటలు వేశారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన వీరిద్దరూ ఆ తర్వాత క్రమంగా బ్యాట్ ఝులిపించారు. 4 పరుగుల వద్ద కుల్దీప్.. కాన్వే క్యాచ్ మిస్ చేయడంతో టీమిండియా త్వరగా తొలి వికెట్ సాధిబీచే అవకాశాన్ని కోల్పోయింది. ఈ క్రమంలో మొదట నికోల్స్ తర్వాత కాన్వే తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఓపెనింగ్ జోడీని హర్షిత్ రానా విడగొట్టాడు.
►ALSO READ | క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్.. వన్డే ఫార్మాట్లో తొలి ప్లేయర్గా రేర్ ఫీట్
నికోల్స్ (62) ను ఔట్ చేసి ఇండియాకు తొలి వికెట్ అందించాడు. కాసేపటికే కాన్వే (56) కూడా ఔట్ కావడంతో కివీస్ స్వల్ప వ్యవధిలో ఓపెనర్లను కోల్పోయింది. ఆ తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన విల్ యంగ్ (12).. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఫిలిప్స్ (12) నిరాశపరిచారు. దీంతో వికెట్ నష్టపోకుండా 117 పరుగులతో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్.. 170 పరుగులకు నాలుగు వికెట్లను చేజార్చుకుంది. వికెట్ కీపర్ మిట్చ్ హే (18), కెప్టెన్ మైకేల్ బ్రేస్ వెల్ (16) తక్కువ పరుగులకే వెనుదిరగడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడినట్టు అనిపించింది. అయితే ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో మిచెల్ (88)చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టుకు డీసెంట్ టోటల్ అందించాడు.
Kyle Jamieson's four-for gave India a sweat but a timely cameo from Harshit Rana and a composed finish from KLR gives India the opener ✅
— ESPNcricinfo (@ESPNcricinfo) January 11, 2026
🔗 https://t.co/2DbNP4qKJF pic.twitter.com/9icYf8YrlX
