ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ 2026 కొత్త ఏడాదిలో జరిగే అతిపెద్ద ఈవెంట్‌లలో ఒకటైన రిపబ్లిక్ డే సేల్‌కు రెడీ అవుతుంది. ఈసారి సేల్స్ జనవరి 17న ప్రారంభమవుతుండగా... మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ లేదా ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యులైతే జనవరి 16న అంటే ఒక రోజు ముందే యాక్సెస్ లభిస్తుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లియెన్సెస్ పై భారీ డీల్స్ ఆశించొచ్చు.
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ సేల్ ద్వారా బెస్ట్ ఆఫర్స్, డిస్కౌంట్స్ పొందోచ్చు. గత కొన్నేళ్లు పరిశీలిస్తే, ఈ సేల్ సమయంలో భారీ డిస్కౌంట్లతో పాటు ఐఫోన్ ధర మరింత అవకాశం ఉంది. అంతేకాదు శామ్‌సంగ్, ఐకూ, పోకో, వివో వంటి కంపెనీల స్మార్ట్‌ఫోన్ల ధరలు చాల తగ్గుతాయి. పాత ఫోన్ తో కొత్త ఫోన్ కొనే ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉంటాయి.
కేవలం స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాదు.. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, బ్లూటూత్ స్పీకర్లు, ఇయర్‌బడ్స్, ఎలక్ట్రానిక్స్ & హోమ్ అప్లయన్సెస్ పై కూడా బంపర్స్ డిస్కౌంట్స్ ఉంటాయి. అలాగే ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు కొనేవారికి కూడా మంచి ఆఫర్లు ఉంటాయి.
షాపింగ్‌ను మరింత చౌకగా మార్చడానికి ఫ్లిప్‌కార్ట్ కొన్ని బ్యాంక్ ఆఫర్లను కూడా ఇస్తోంది. వీటిలో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, ఈజీ EMI ఫెసిలిటీ ఉంది. ఇతర కొన్ని బ్యాంక్ కార్డులపై 15% వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. 'రష్ అవర్', 'జాక్‌పాట్ డీల్స్' పేరుతో తక్కువ సమయంలో ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి.
