ఆలస్యం చేయకుండా మాతో ఒప్పందం చేసుకోండి: క్యూబాకు ట్రంప్ వార్నింగ్

ఆలస్యం చేయకుండా మాతో ఒప్పందం చేసుకోండి: క్యూబాకు ట్రంప్ వార్నింగ్

వాషింగ్టన్: వెనిజులాపై మిలిటరీ ఆపరేషన్ చేపట్టి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన అమెరికా మరో దేశంపై కన్నేసింది. తాజాగా లాటిన్ అమెరికా దేశం క్యూబాకు డొనాల్డ్ ట్రంప్ బహిరంగా హెచ్చరికలు జారీ చేశాడు. ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా మాతో ఒప్పందం చేసుకోవాలని బెదిరించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఫ్లాట్‎ఫామ్ ట్రూత్ వేదికగా పోస్ట్ పెట్టాడు. 

‘‘క్యూబా చాలా సంవత్సరాలుగా వెనిజులా డబ్బు, చమురుతో బతికింది. ప్రతిఫలంగా వెనిజులాకు భద్రతా సేవలు అందించింది. కానీ ఇకపై అలా కుదరదు. ఇప్పటి నుంచి వెనిజులా నుంచి క్యూబాకు ఆయిల్, డబ్బు వెళ్లదు. ఈ విషయంలో ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా అమెరికాతో క్యూబా ఒప్పందం కుదుర్చుకోవాలి’’ అని ట్రంప్ పేర్కొన్నాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా సైన్యం ఇప్పుడు వెనిజులాకు రక్షణగా ఉందని.. ఇకపై క్యూబా అవసరం లేదన్నాడు. 

►ALSO READ | చావు దెబ్బ తిన్న బుద్ధి రాలే..! ఇండియా నన్ను చూసి బయపడుతుందంటూ పహల్గామ్ మాస్టర్ మైండ్ బలుపు కూతలు

కాగా, ఇటీవల వెనిజులాపై అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. నార్కో టెర్రరిజాన్ని బూచిగా చూపిస్తూ వెనిజులాపై వైమానిక దాడులు చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికన్ దళాలు ఎత్తుకెళ్లాయి. ఇక వెనిజులాను తామే పాలిస్తామని ట్రంప్ సంచలన ప్రకటన చేశాడు. వెనిజులా క్రూడ్ ఆయిల్ నిల్వలను యూఎస్ హ్యాండోవర్ చేసుకుంది. దీంతో వెనిజులా ముడి చమురుపై ఆధారపడ్డ దేశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.