టికెట్ లేకుండా రైళ్లలో.. ఇంత మంది జర్నీ చేస్తున్నారా..? ఒక్క జనవరి 10నే ఎంత ఫైన్ వసూలైందంటే..

టికెట్ లేకుండా రైళ్లలో.. ఇంత మంది జర్నీ చేస్తున్నారా..? ఒక్క జనవరి 10నే ఎంత ఫైన్ వసూలైందంటే..

దక్షిణ మధ్య రైల్వే టికెట్ చెకింగ్ రెవెన్యూపై కీలక ప్రకటన చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో.. ఒక్క జనవరి 10వ తేదీనే కోటీ 22 లక్షల రూపాయలు.. టికెట్ లేని ప్రయాణికుల నుంచి జరిమానా రూపంలో ఆదాయం వచ్చిందని రైల్వే ప్రకటించింది. గత నవంబర్ నుంచి.. టికెట్ లెస్ ప్యాసింజర్ల నుంచి జరిమానాల రూపంలో ఒక్కరోజే కోటి రూపాయలకు పైగా ఆదాయం దక్కడం ఇది పదో సారి అని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

దక్షిణ మధ్య రైల్వే 153 స్పెషల్ ట్రైన్లు నడుపుతున్నది. నెల రోజుల ముందే ఈ ట్రైన్లను ప్రకటించిన రైల్వే శాఖ.. టికెట్ల బుకింగ్ కూడా ప్రారంభించింది. ఇప్పటికే చాలా రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి.

సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రోజుకు సగటున 2.20 లక్షల మంది, లింగంపల్లి నుంచి 50 వేల మంది, చర్లపల్లి నుంచి 35 వేల మంది జర్నీ చేస్తున్నారు. టికెట్ల కొనుగోలు, రైలు ఎక్కేటప్పుడు తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని రైల్వే సీఆర్​వో శ్రీధర్ తెలిపారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 17 బుకింగ్ కౌంటర్లు, 20 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు ఏర్పాటు చేశామన్నారు. రైల్ వన్ మొబైల్ యాప్​తో ఆన్ రిజర్వ్ డ్ టికెట్ బుక్ చేసుకుంటే 3% తగ్గింపు ఉందని తెలిపారు. ఇది 14 జనవరి నుంచి 18 వరకు అమల్లో ఉంటుందని చెప్పారు.