అహ్మదాబాద్‌లో బయటపడ్డ ఒక భారీ స్కామ్ 'షోలే' సినిమాలోని ట్విస్ట్‌లను తలపిస్తోంది. నెలకు కేవలం రూ.10వేలు సంపాదించే ఒక సాధారణ రాపిడో డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ.300 కోట్ల లావాదేవీలు జరగడం చూసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులే నోరెళ్లబెట్టారు. ఈ చిన్న తాడు పట్టుకుని లాగితే.. ఏకంగా రూ.550 కోట్ల భారీ హవాలా, బెట్టింగ్ రాకెట్ గుట్టు బయటపడింది.
సాధారణ డ్రైవర్.. అసాధారణ లావాదేవీలు:
అహ్మదాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతని బ్యాంకు ఖాతాలో గత కొంతకాలంగా జరుగుతున్న భారీ డబ్బు ట్రాన్సాక్షన్లపై బ్యాంకు సిబ్బందికి అనుమానం వచ్చి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఈడీ విచారణలో ఆ డ్రైవర్ పేరు మీద ఉన్న ఖాతా కేవలం ఒక 'డమ్మీ' అని.. దానిని ఒక పెద్ద క్రైమ్ సిండికేట్ వాడుకుంటోందని కనిపెట్టారు.
స్టాక్ మార్కెట్ లింకులు:
ఈ విచారణలో బయటపడిన ప్రధాన అంశం ఏంటంటే.. ఈ డబ్బు ఇల్లీగల్ క్రికెట్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ ద్వారా వచ్చినవేనట. నిందితులు అమాయక ప్రజల ఆధార్, పాన్ కార్డులను సేకరించి, వారి పేరుతో ఫేక్ కంపెనీలు, బ్యాంక్ ఖాతాలను సృష్టించారు. ఈ ఖాతాల ద్వారా హవాలా మార్గాల్లో విదేశాలకు.. అలాగే దేశీయంగా ఉన్న బెట్టింగ్ నెట్‌వర్క్‌లకు నిధులు తరలిస్తున్నారు.
ALSO READ : ఏప్రిల్ 1, 2026 నుంచి అమ్మనున్న E20పెట్రోల్ రేటు ఎంత ఉండొచ్చంటే..
హవాలా నెట్‌వర్క్ గుట్టురట్టు:
ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారులు డ్రైవర్ వంటి సామాన్యులకు చిన్న మొత్తం ఆశ చూపి.. వారి బ్యాంక్ వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.550 కోట్ల మేర జరిగిన ఈ లావాదేవీల్లో సింహభాగం హవాలా ఛానల్స్ ద్వారానే మళ్లించారు. ఈడీ జరిపిన సోదాల్లో అనేక డిజిటల్ డివైజ్‌లు, నకిలీ స్టాంపులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ : ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మెుజ్తబా ఖమేనీ.. వేల కోట్ల ఆస్తుల చిట్టా ఇదే..
ప్రస్తుతం ఈ డ్రైవర్‌తో పాటు ఈ నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర సూత్రధారుల కోసం ఈడీ గాలిస్తోంది. సామాన్యులు తమ బ్యాంకు ఖాతాల వివరాలను.. ఓటీపీలను గుర్తుతెలియని వ్యక్తులకు ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రమాదకరమైన హవాలా ఉచ్చులో చిక్కుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
