ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మెుజ్తబా ఖమేనీ.. వేల కోట్ల ఆస్తుల చిట్టా ఇదే..

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మెుజ్తబా ఖమేనీ.. వేల కోట్ల ఆస్తుల చిట్టా ఇదే..

ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా అలీ ఖమేనీ కుమారుడు మెుజ్తబా ఖమేనీ(56) బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అలీ ఖమేనీ మరణించటంతో 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' మెుజ్తబాను ఎంపిక చేసినట్లు కొత్త అధినేతగా.

మెుజ్తబా ఖమేనీ కేవలం రాజకీయ వారసుడిగానే కాకుండా.. భారీ స్థాయిలో ఆర్థిక సామ్రాజ్యాన్ని కూడా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన అధికారికంగా ఎటువంటి ప్రభుత్వ పదవిలో లేనప్పటికీ.. తెరవెనుక వేల కోట్ల రూపాయల పెట్టుబడులను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. మెుజ్తబాకు ప్రపంచవ్యాప్తంగా భారీ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం ఉంది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల మార్కెట్లలో బిలియన్ల కొద్దీ డాలర్లను ఆయన మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే బ్రిటన్‌లో మెుజ్తబాకు అత్యంత ఖరీదైన విలాసవంతమైన భవనం ఉందని, దీని విలువ సుమారు సుమారు రూ.1,150 కోట్లకు పైమాటేనని సమాచారం.

అలాగే స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఆయనకు భారీగా రహస్య ఖాతాలు ఉన్నట్లు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇరాన్ నిధులను అక్రమంగా విదేశాలకు తరలించారనే ఆరోపణలతో 2019లో అమెరికా ఆయనపై ఆంక్షలు కూడా విధించిన సంగతి తెలిసిందే. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC)తో మెుజ్తబాకు ఉన్న సన్నిహిత సంబంధాలు ఆయన ఆర్థిక బలాన్ని మరింత పెంచాయి. ఇరాన్‌లోని కీలక పరిశ్రమలు, క్రూడ్ ఆయిల్ బిజినెస్, విదేశీ పెట్టుబడులపై ఆయనకు పట్టు ఉందని నిపుణులు చెబుతున్నారు. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు మెుజ్తబా పెట్టుబడులను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అణచివేత ధోరణి ఉన్న పాలకుల అనుచరులు తమ దేశాల్లోని ప్రాపర్టీ మార్కెట్‌ను 'సేఫ్ డిపాజిట్ బాక్స్'గా వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇరాన్ సంప్రదాయం ప్రకారం తండ్రి తర్వాత కుమారుడు సుప్రీం లీడర్ కావడం అనేది కొంత వ్యతిరేకతకు దారితీసే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో IRGC సపోర్ట్ తో ఆయన అధికారం చేపడుతున్నట్లు కనిపిస్తోంది. మెుజ్తబా భార్య జహ్రా హద్దాద్-అడెల్ కూడా ఇటీవలి దాడుల్లో మరణించారు. ఈ అనిశ్చితి మధ్య మెుజ్తబా ఖమేనీ ఆస్తులు, ఆయన ఆర్థిక మూలాల గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.