VijayRashmika: విజయ్‌కు భోజనం తినిపించిన రష్మిక.. హైదరాబాద్ ఫ్యాన్ మీట్‌లో 'విరోష్' సందడి!

VijayRashmika: విజయ్‌కు భోజనం తినిపించిన రష్మిక.. హైదరాబాద్ ఫ్యాన్ మీట్‌లో 'విరోష్' సందడి!

టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ,  రష్మిక మందన్న (Virosh) వైవాహిక బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత వరుస ఆచారాలతో బిజీగా ఉన్న ఈ జంట లేటెస్ట్ గా తమ అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించి వార్తల్లో నిలిచారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్ వైరల్ గా మారాయి.

సంప్రదాయబద్ధంగా వేడుకలు

పెళ్లి ముగిసిన వెంటనే ఈ కొత్త జంట విజయ్ దేవరకొండ సొంత గ్రామం, తెలంగాణలోని తుమ్మనపేటను సందర్శించారు. అక్కడ తమ కొత్త ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం,  గృహప్రవేశం వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టుచీరలో రష్మిక, కుర్తాలో విజయ్  మెరిసిపోయారు. ఈ సందర్భంగా విజయ్ తన దాతృత్వాన్ని చాటుకుంటూ, స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించారు. తమ గ్రామ ప్రజలందరికి భోజనాలు పెట్టారు.

అభిమానులతో 'విరోష్' విందు.. 

హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగడానికి ముందు, మంగళవారం,ఫిబ్రవరి 3న విజయ్-రష్మిక ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ మీట్-అప్ ఏర్పాటు చేశారు.  ప్రేమతో మీ #VIROSH" అనే బోర్డుతో అభిమానులకు ఘనస్వాగతం పలికారు. స్టార్ హోదాను పక్కన పెట్టి, తాము స్వయంగా అభిమానులకు భోజనాలు వడ్డించారు. అభిమానులతో భోజనం చేస్తూ.. రష్మిక తన చేతులతో విజయ్‌కు ముద్దలు తినిపించారు.  ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్

ఈరోజు (మార్చి 4) సాయంత్రం హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ జరగనుంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన టాప్ సెలబ్రిటీలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఆహ్వానించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వేడుకను కేవలం ఆహ్వానితులకు మాత్రమే పరిమితం చేశారు.