టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతున్నట్లు సమాచారం. క్రేజీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ.. నటసింహం బాలకృష్ణ కాంబోలో ‘NBK112’ ప్రాజెక్ట్ చేయనున్నట్లు టాక్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం మాస్-క్లాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఈ మూవీ రేపు (మార్చి 5న) ప్రారంభం కానుందని సమాచారం.
అన్నీ సెట్ అయితే, ఈ ఏడాది ఆగష్టు లోపు ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అధికారిక ప్రకటన రేపే వచ్చే ఛాన్స్ ఉంది. ‘సరిపోదా శనివారం’తో వంద కోట్ల బాక్సాఫీస్ విజయాన్ని అందుకున్న వివేక్ ఆత్రేయ, బాలకృష్ణను కొత్త లుక్‌లో ఎలా ప్రెజెంట్ చేస్తాడన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ALSO READ : రిలీజ్ ముందే 'పెద్ది' రికార్డులు..
గతంలో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, సూపర్ స్టార్ రజినీకాంత్ కు కథ వినిపించి ఓకే చెప్పించుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్‌డేట్ బయటకు రాలేదు. ఈ క్రమంలో ఆ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
బాలయ్య-గోపీచంద్ NBK111:
నటసింహం నందమూరి బాలకృష్ణ , దర్శకుడు మలినేని గోపీచంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘NBK111’. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నెలలో మూవీ పట్టాలెక్కించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. బడ్జెట్ ఇష్యూలతో స్టోరీ మారిపోయింది. మొదట ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో హిస్టారికల్ డ్రామాగా ప్లాన్ చేసినప్పటికీ, బడ్జెట్ సమస్యల కారణంగా కథలో మార్పులు చేసినట్లు సమాచారం.
గోపీచంద్ మలినేని మొదట అనుకున్న పీరియడ్ డ్రామా కాన్సెప్ట్‌ను పక్కన పెట్టి, ప్రస్తుతం ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాలకృష్ణ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. బాలయ్య మార్క్ డైలాగ్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడిన కొత్త స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఈ మార్పుల వల్ల సినిమా నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా, బాలయ్య మాస్ ఆడియన్స్‌కు ఇది బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి, వేగంగా పూర్తి చేసి దసరా బరిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
A Majestic Beginning…
— NBK 111 (@NBK111Movie) November 27, 2025
A Historical roar…
And an empire blessed by revered guests 🦁🔥
Here are the GRAND highlights of the #NBK111 Pooja Ceremony ❤️🔥
▶️ https://t.co/JYux2bsXPC
GOD OF MASSES #NandamuriBalaKrishna #Nayanthara @megopichand @Venkataskilaru @vriddhicinemas… pic.twitter.com/JDtSmpdsLv
బాలయ్య జోరు.. ఫ్యాన్స్ ఆశలు
వరుసగా ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహరాజ్’ వంటి హిట్‌లతో ఊపు మీదున్న బాలయ్య.. రీసెంట్‌గా 'అఖండ 2' తో సందడి చేశారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
ALSO READ : ఎవరు గెలిస్తే ఆ మతంలోకి మారతా..
ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘NBK111’, ‘NBK112’ సినిమాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మరింత పవర్ ఫుల్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే గోపీచంద్ మలినేని, వివేక్ ఆత్రేయలను లైన్లో పెట్టేశాడు బాలయ్య.
ఇదిలా ఉండగా, బాలయ్య ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా దాదాపు కన్ఫామ్ అయినట్టే అనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న దర్శకులను బాలయ్య లైన్‌లో పెట్టుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రాజెక్టులపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టత రానుంది.
బాలయ్య-హరీష్ శంకర్!
బాలయ్య బాబు కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం ఓ సాలిడ్ కథను సిద్ధం చేసి ఉంచాడట. ఈ సినిమాను నాగ వంశీ నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారని టాక్. అయితే, హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఫలితంపైనే.. బాలయ్య ప్రాజెక్ట్ ఉంటుందని సమాచారం. ఏమవుతుందో చూడాలి.
బాలయ్య- డైరెక్టర్ హనీఫ్!
మలయాళంలో ‘మార్కో’ వంటి స్టైలిష్ యాక్షన్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హనీఫ్ అదేని కూడా బాలయ్యతో సినిమా చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక ఇంటెన్స్ యాక్షన్ స్టోరీని బాలయ్యకు వినిపించారని టాక్. అన్ని కుదిరితే ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ లో నిర్మించే అవకాశం ఉందని సమాచారం. త్వరలో అప్డేట్ రానుంది.
బాలయ్య- కొరటాల శివ!
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు కథ వినిపించారట. సోషల్ మెసేజ్ తో కూడిన మాస్ యాక్షన్ కథను సిద్ధం చేశాడట. బాలయ్య గ్రీన్ సిగ్నల్ కోసం కొరటాల వెయిట్ చేస్తున్నట్లుగా టాక్.
