ఈ సంక్రాంతికి హైదరాబాద్ జేబీఎస్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

ఈ సంక్రాంతికి హైదరాబాద్ జేబీఎస్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లే ప్రజలతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జేబీఎస్ బస్టాండ్ నుంచి 550 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు TGSRTC తెలిపింది. సంక్రాంతి పండుగకు తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రజల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. తెలంగాణ ఆర్టీసీ సంక్రాంతి పండుగ దృష్ట్యా 6 వేల 431 ప్రత్యేక స్పెషల్ బస్సులను నడుపుతుండటం గమనార్హం.

ఈసారి సంక్రాంతికి పండుగ సెలవులు ఎక్కువ రోజులు రావడంతో పట్నం వీడి ప్రజలు పల్లెల బాట పట్టారు. ప్రయాణికుల రద్దీని ముందుగానే అంచనా వేసిన ఆర్టీసీ అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్లోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, తార్నాక, కూకట్ పల్లి బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. బస్సు ఎక్కేందుకు వచ్చిన ప్రయాణికుల కోసం షెల్టర్ల దగ్గర ప్రత్యేక సౌకర్యాలను ఆర్టీసీ కల్పించింది.