IND vs NZ: నువ్వు కొట్టి నువ్వే షాక్‌లోకి వెళ్తే ఎలా.. అయ్యర్ మెరుపు రనౌట్‌కు స్టేడియం ఫిదా

IND vs NZ: నువ్వు కొట్టి నువ్వే షాక్‌లోకి వెళ్తే ఎలా.. అయ్యర్ మెరుపు రనౌట్‌కు స్టేడియం ఫిదా

న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రేయాస్ అయ్యర్ మెరుపు ఫీల్డింగ్ కు స్టేడియం ఆశ్చర్యానికి గురైంది. ఆదివారం (జనవరి 11) వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ సీన్ చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 43 ఓవర్ చివరి బంతిని హర్షిత్ రానా మిచెల్ కు స్లో డెలివరీ వేశాడు. మిచెల్ బంతిని మిడాన్ మీదుగా ఆడాడు. మిడాన్ లో ఫీల్డర్ లేకపోవడంతో రెండో పరుగు కోసం రమ్మని కెప్టెన్ బ్రేస్ వెల్ ను మిచెల్ పిలిచాడు. అప్పటికే లాంగాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ మెరుపు మేగంతో ముందుకు వచ్చి బంతిని వికెట్లకు విసిరాడు. 

మెరుపు వేగంతో వేసిన ఈ త్రో రెప్పపాటులో వికెట్లకు తగలడంతో బ్రేస్ వెల్ రనౌట్ అయ్యాడు. ఈ రనౌట్ ను చూసిన అయ్యర్ షాకయ్యాడు. అంతేకాదు స్టేడియంలో ప్రేక్షకులు అయ్యర్ చేసిన రనౌట్ కు ఫిదా అయ్యారు. శ్రేయాస్ మెరుపు త్రో కారణంగా బ్రేస్ వెల్ 16 పరుగులకే ఔటయ్యాడు. ప్రస్తుతం అయ్యర్ చేసిన ఈ రనౌట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. మిచెల్ 84 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షిత్ రానా, ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది.  

ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ విధించిన 300 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో ప్రస్తుతం ఇండియా 35 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. క్రీజ్ లో కోహ్లీ (85), అయ్యర్ (36) ఉన్నారు. రోహిత్ శర్మ 26 పరుగుల వద్ద ఔటయ్యాడు.