బుమ్రా.. ఈ పేరు వింటనే మెరుపుల్లా దూసుకుపోయే బంతులు.. బుల్లెట్ వేగంగా వెళ్లే యార్కర్ బాల్స్ గుర్తుకు వస్తాయి. అలాంటి బుమ్రాకు బౌలింగ్ నేనే నేర్పించానని గొప్పలు చెప్పుకున్నాడు పాకిస్తాన్‌లో జన్మించిన యుఎఇ బౌలర్ జహూర్ ఖాన్. 2019లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా బౌలింగ్ యాక్షన్‌లో ఎలాంటి మార్పులు లేకుండా బంతి స్లోగా విసరడం ఎలాగో బుమ్రాకు పాఠాలు చెప్పానన్నాడు. అప్పుడు తాను ముంబై ఇండియన్స్ నెట్ బౌలర్గా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
ఈ టెక్నిక్కు ఫిదా అయిన బుమ్రా తనను మెచ్చుకున్నాడని చెప్పారు. బుమ్రా వంటి ప్రపంచ స్థాయి బౌలర్ నా దగ్గర బౌలింగ్ టిప్స్ నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. పాకిస్తాన్ లో పుట్టిన ప్రతిఒక్కరికి గొప్పలు చెప్పుకోవడం, అబద్ధాలు ఆడటం బై బర్తే వస్తాయని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుందని.. తెలియని విషయం అడిగి తెలుసుకోవడంలో తప్పేమి లేదని మరికొందరు సమర్ధిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇండియా, శ్రీలంక వేదికలుగా సంయుక్తంగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఎడిషన్ విశ్వవిజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ ను ఏకంగా 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి సూర్యకుమార్ సేన టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫైనల్ మ్యాచులో బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు కీలకమైన వికెట్లు తీసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
