Allu Arjun: నీ పుట్టుకే నా అదృష్టం.. నువ్వు పుట్టినందుకు థ్యాంక్స్ డార్లింగ్.. అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Allu Arjun: నీ పుట్టుకే నా అదృష్టం.. నువ్వు పుట్టినందుకు థ్యాంక్స్ డార్లింగ్.. అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబో అంటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డులు, అవార్డులు, వెయ్యి కోట్ల వసూళ్లకు పర్యాయపదంగా మారింది. ఈ క్రియేటివ్ కాంబో లక్ష్యం ఎప్పుడూ ఒక్కటే.. "ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడం". అలా పుష్ప: ది రైజ్ మరియు పుష్ప 2: ది రూల్ సినిమాలతో ఈ కాంబో సాధించిన విజయాలు అసాధారణమైనవి. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1900 కోట్లకు పైగా గ్రాస్, రూ.1228 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వసూలు చేసి, ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన మూవీగా నిలిచింది. అంతేకాదు, ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో కూడా భారతీయ సినిమాకు గొప్ప గుర్తింపు తీసుకువచ్చాయి.

ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న సుకుమార్–అల్లు అర్జున్ కాంబోపై, ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది వెంటనే హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే, ఈ జంట పేరు వినగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది ఈ కాంబో ఇప్పటివరకు సాధించిన విజయాల ప్రతిబింబానికి నిదర్శనం అని చెప్పుకోవాలి. లేటెస్ట్గా అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.  

ఇవాళ ఆదివారం (జనవరి 11న) సుక్కు భాయ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఓ రెండు క్రేజీ ఫోటోలను షేర్ చేసి, ఇంట్రెస్టింగ్ క్యాప్షన్తో పుట్టినరోజు విషెస్ తెలియజేశారు. 

‘‘హ్యాపీ బర్త్‌డే, డార్లింగ్ సుకుమార్. ఈ రోజు నీకంటే నాకు ఇంకా ప్రత్యేకం.. ఎందుకంటే నా జీవితాన్ని మార్చిన రోజు ఇదే. నా జీవితంలో నువ్వున్న ఆనందాన్ని ఏ మాటలూ పూర్తిగా చెప్పలేవు. పుట్టినందుకు థ్యాంక్స్.. నా జీవితంలోకి వచ్చి నా ప్రపంచాన్నే మార్చినందుకు’’అని బన్నీ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్పై ఎన్నోసార్లు తన ప్రేమని వ్యక్తపరిచి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. పుష్ప 2 గ్రాండ్ స‌క్సెస్ మీట్  (2025ఫిబ్రవరి 8న) ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సుకుమార్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ‘ఒక సినిమాకు నటులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ ఎంతైనా చేయొచ్చు.. కానీ అందరికీ హిట్ ఇచ్చేది మాత్రం ఒక్క దర్శకుడే. అందరికీ క్రెడిట్ ఇచ్చి తను మాత్రం క్రెడిట్ తీసుకోడు. మా అందరి క్రెడిట్ సుకుమారే.

ఒక సినిమాలో ఏది బాగున్నా, ఎవరి వర్క్ బాగున్నా.. అది ఆ దర్శకుడు దానికి ఇచ్చే స్పేస్ వల్లే. సినిమాలో పలానా క్రాఫ్ట్ బాగుంది అంటే అది ఆర్టిస్ట్‌‌, టెక్నీషియన్ గొప్పతనం కాదు.. దర్శకుడి గొప్పతనం. ఇందులో నా పెర్ఫార్మెన్స్ అంత బాగుంది అంటే ఆ క్రెడిట్ సుకుమార్‌‌‌‌దే. మమ్మల్నందరినీ గైడ్ చేసిన తనకు థ్యాంక్స్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే స్టాండింగ్‌‌ ఒవేషన్‌‌తో సుకుమార్‌‌‌‌కు థ్యాంక్స్ చెబుతున్నాం. యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ తనను చూసి గర్వపడుతోంది. సుకుమార్ నాకు ఓ పర్సన్ కాదు.. ఎమోషన్. తనకు నేను బిగ్గెస్ట్‌‌ ఫ్యాన్‌‌ను. తను ఓ జీనియస్’ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇలా ఎన్నో సార్లు సుక్కుపై అల్లు అర్జున్ తన ప్రేమని వ్యక్తపరిచారు.