కరీంనగర్ జిల్లాలో ఎంత పెద్ద కంటైనర్ బోల్తా పడిందో చూడండి !

కరీంనగర్ జిల్లాలో ఎంత పెద్ద కంటైనర్ బోల్తా పడిందో చూడండి !

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో పెద్ద కంటైనర్ బోల్తా పడింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ శివారులో కంటైనర్ బోల్తా పడి రానావేణి హన్మయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. ఇక.. కామారెడ్డి జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో కంటైనర్ లారీ కారును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ.. కారులో ఉన్న భార్యాభర్త ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర్ నగర్ గ్రామం దగ్గర 44వ హైవేపై ఆదివారం జరిగింది.

సృజన్ మోహన్ రెడ్డి-పద్మ దంపతులు నిజామాబాద్ టౌన్లో ఉంటున్నారు. నిజామాబాద్ నుంచి కారులో హైదరాబాద్కు ఆదివారం ఉదయం బయలుదేరారు. అయితే.. వీళ్లు ప్రయాణిస్తున్న కారును అదుపు తప్పి మితిమీరిన వేగంతో వస్తున్న కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. కంటైనర్ డ్రైవర్ కారును కొద్ది దూరం ఈడ్చుకెళ్లి ఆగింది.

కారులో ఉన్న భార్యాభర్త ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎట్టకేలకు కారులో నుంచి బయటపడ్డారు. స్థానికులు కారులో ఉన్న ఇద్దరినీ జాగ్రత్తగా బయటకు తీయడంతో మోహన్ రెడ్డి, పద్మ షాక్ నుంచి కొంతసేపటికి తేరుకుని ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు స్పాట్కు చేరుకుని ప్రమాదానికి గురైన కారును స్టేషన్కు తరలించారు. కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.