‘దళితుల అభ్యున్నతికి తోడ్పడేది కాంగ్రెస్సే’ : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

‘దళితుల అభ్యున్నతికి తోడ్పడేది కాంగ్రెస్సే’ : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్, వెలుగు: దళితుల అభ్యున్నతికి తోడ్పడేది కాంగ్రెస్సేనని, అలాంటి పార్టీకి దళితులు మొదటి నుంచీ వెన్నంటి ఉన్నారని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.  పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ గా నియమితులయ్యాక మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తొలిసారి శనివారం జిల్లాకు రాగా.. కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. 

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి  ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపించారని తెలిపారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోడూరు సత్యనారాయణ గౌడ్, ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ నేతలు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఒడితల ప్రణవ్ బాబు తదితరులున్నారు.