ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తిచేసే కొద్దీ నిధులు మంజూరు చేస్తామని అన్నారు ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క. ఆదివారం (జనవరి 11) రామగుండం పర్యటనలో భాగంగా మాట్లాడిన భట్టీ. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు విడతలవారీగా విడుదల చేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గానికి 3500 ఇండ్లు నిర్మించేందుకు ఒక్కో ఇంటికి 5 లక్షలు ఇస్తున్నన్నట్లు చెప్పారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. రామగుండం అభివృద్ధి కోసం, ప్రజల అవసరాల కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిత్యం పని చేస్తున్నారని అభినందించారు.
రామగుండం లో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ కోసం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టీ. కొద్దీ రోజుల్లోనే పవర్ ప్రాజెక్టు ప్రకటన చేస్తామని తెలిపారు. రాజకీయ అవసరాల కోసం ప్రజలను అయోమయానికి గురిచేయవద్దని సూచించారు. రామగుండం ప్రాంతంలోని పరిశ్రమలు అందరికి ఉపయోగ పడుతున్నాయన్నారు. రామగుండం లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రాజెక్టు లే తప్ప బీఆర్ఎస్ చేసింది ఏమి లేదన్నారు.
సింగరేణి కెలోరీస్ అనేది అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థఅని.. కాపాడుకునే బాధ్యత అందరి పై ఉందన్నారు. సింగరేణి మైనింగ్ కేవలం బొగ్గు ఉత్పత్తి లొనే కాదు అన్ని రంగాల్లో రాణించెందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాదభీమా కల్పించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రామగుండం అభివృద్ధి ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తి సహకారం అందిస్తామన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
గతంలో బీహార్ ఎస్ హయాంలో పురుగుల బియ్యం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ఇచ్చారు. మహిళలు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
