గోదావరిఖనిలో సింగరేణి సేవా భవన్ ప్రారంభం

గోదావరిఖనిలో సింగరేణి సేవా భవన్ ప్రారంభం

గోదావరిఖని, వెలుగు: సింగరేణి మహిళలకు ఉపయోగపడేలా గోదావరిఖని సీఎస్​పీ కాలనీ వద్ద నిర్మించిన సింగరేణి సేవా భవన్, సేల్స్ కౌంటర్ షాపులను సంస్థ సేవా అధ్యక్షురాలు, డైరెక్టర్ (ఆపరేషన్స్) సూర్యనారాయణ సతీమణ మాలతి శనివారం ప్రారంభించారు. సింగరేణి మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని, సంస్థ అందించే శిక్షణను ఉపయోగించుకొని జీవితంలో స్థిరపడాలని సూచించారు. ఆర్జీ–1 ఏరియా సేవా అధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ల సతీమణులు కె.విజయ, ఎం.పద్మ, వాణి, ఎస్​వోటూ జీఎం చంద్రశేఖర్​ తదితరులు పాల్గొన్నారు.