SBI బ్యాంక్ పాత కస్టమర్లకు 2 లక్షలు ఇస్తుంది ! ఎందుకో తెలుసా..

SBI  బ్యాంక్ పాత కస్టమర్లకు 2 లక్షలు ఇస్తుంది ! ఎందుకో తెలుసా..

కొన్నిసార్లు, మీకు అనుకోకుండా  డబ్బు అవసరం అయ్యే పరిస్థితి రావచ్చు. అప్పుడు ఎక్కువగా మీరు ఫ్రెండ్స్, బంధువులు లేదా పరిచయస్తులను అడిగి  డబ్బును తీసుకునేందుకు  ప్రయత్నిస్తారు. కానీ మీకు అవసరమైన మొత్తం ఎక్కువ ఉంటే ఎం చేయాలి..? ఇలాంటి పరిస్థితిలో పర్సనల్ లోన్ ఒక మంచి అప్షన్  కావచ్చు. మీకు దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో అకౌంట్ ఉంటే, మీ డబ్బు సమస్య  వెంటనే పరిష్కరం అవుతుంది. 

మీ ఇన్‌స్టాగ్రామ్ లో SBI  బ్యాంక్ కస్టమర్లకు రూ.2 లక్షలు ఇస్తుందనే వీడియోను చూసి ఉండవచ్చు. ఈ వీడియో నిజానికి SBI  బ్యాంక్ RTXC (రియల్-టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్) ఆఫర్ గురించి, అయితే 2 లక్షలు మాత్రమే కాకుండా 35 లక్షల వరకు అందిస్తుంది. SBI   ప్రత్యేక కస్టమర్ల కోసం ఈ  రియల్-టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ (RTXC) ఆఫర్‌ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద కస్టమర్లు YONO యాప్ ద్వారా 35 లక్షల వరకు పర్సనల్ లోన్  పొందోచ్చు. ప్రత్యేకత ఏమిటంటే ఈ లోన్ కి ఎటువంటి పేపర్స్ అవసరం లేదు.

దరఖాస్తు విధానం: మీరు మీ మొబైల్‌లోని YONO యాప్‌ని ఉపయోగించి ఈ లోన్ కోసం ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. తరువాత మీరు మీ ఆధార్ OTPని ఉపయోగించి ఇ-సైన్ చేయవచ్చు.

వడ్డీ రేటు ఎలా ఉంటుంది:
వడ్డీ రేట్లు 2 సంవత్సరాల MCLRతో లింకై మొత్తం లోన్ కాలానికి నిర్ణయించబడుతుంది. 

ఈ ఆఫర్‌ను ఎవరు పొందవచ్చు: ఈ ఆఫర్ SBIలో సాలరీ అకౌంట్ ఉన్న కస్టమర్లకు మాత్రమే లభిస్తుంది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం, డిఫెన్స్, కార్పొరేట్ రంగాలలో పనిచేసే ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ప్రకారం, CIBIL స్కోర్‌ చెక్ చేయడంతో పాటు, అర్హత, లోన్ ఆమోదంతో సహా అన్ని ప్రక్రియలు డిజిటల్‌గా జరుగుతాయి.  అలాగే మీ ప్రతినెల ఆదాయం కనీసం రూ.15వేలు ఉండాలి. మీ CIBIL స్కోరు 650 లేదా 700 కంటే ఎక్కువగా ఉండాలి. 

►ALSO READ | మోస్ట్ వాంటెడ్ సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఇ-యాక్సెస్' విడుదల! కస్టమర్లకు బంపర్ అఫర్..