ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సుజుకి మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సుజుకి ఇ-యాక్సెస్ (Suzuki e-Access)ను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ స్కూటర్‌లో 3kWh కెపాసిటీ LFP బ్యాటరీని వాడారు. సాధారణ బ్యాటరీల కంటే ఇవి ఎక్కువ కాలం లైఫ్ ఇస్తాయని కంపెనీ చెబుతోంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఎండ, వాన, వాతావరణ మార్పులు తట్టుకునేలా ఈ బ్యాటరీని కఠినంగా పరీక్షించారు.
ఇందులో ఉన్న 4.1kW మోటార్ 15Nm టార్క్ ఉత్పత్తి ఇస్తుంది. రోడ్డు పరిస్థితిని బట్టి వాడుకోవడానికి ఇందులో ఎకో, రైడ్-A, రైడ్-B అనే మూడు మోడ్‌లు ఉన్నాయి. బ్యాటరీ ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు కూడా స్కూటర్ స్పీడ్ తగ్గకుండా వెళ్లేలా దీనిని తయారు చేసారు. వెనక్కి వెళ్లడానికి రివర్స్ అసిస్ట్ కూడా ఉంది.
►ALSO READ | ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026: ఆఫర్ల జాతర షురూ.. షాపింగ్ ప్రియులకు పండగే..
స్కూటర్ బరువు తక్కువగా, బలంగా ఉండటానికి అల్యూమినియం బాడీని వాడారు. దీని వల్ల నడిపేటప్పుడు స్కూటర్ కంట్రోల్ తప్పకుండా ఉంటుంది. ఇందులో వాడిన బెల్ట్ సిస్టమ్ సుమారు 70వేల కిలోమీటర్ల వరకు లేదా 7 ఏళ్ల వరకు ఎలాంటి రిపేర్లు లేకుండా పనిచేస్తుందని సుజుకి హామీ ఇస్తోంది.
దీని ధర ఢిల్లీ ఎక్స్-షోరూమ్ లో రూ.1.88 లక్షలు. ఇప్పటికే బుకింగ్స్ మొదలు కాగా.... మీరు ఫ్లిప్‌కార్ట్ లో కూడా ఈ స్కుటరును బుక్ చేసుకోవచ్చు. ఇంకా 7 ఏళ్లు లేదా 80వేల కిలోమీటర్ల వరకు ఎక్స్టెండెడ్ వారంటీ ఉచితంగా లభిస్తుంది.
బై-బ్యాక్ ఆఫర్ కింద కొన్న మూడేళ్ల తర్వాత స్కూటర్ తిరిగి ఇచ్చేయాలనుకుంటే, అసలు ధరలో 60% రిటర్న్ ఇస్తామని కంపెనీ గ్యారెంటీ ఇస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే సుజుకి ఇ-యాక్సెస్ ధర కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.
