Chiranjeevi : 'వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్'.. బ్లాక్‌బస్టర్ సంబరాల్లో మెగాస్టార్, అనిల్ రావిపూడి!

Chiranjeevi : 'వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్'.. బ్లాక్‌బస్టర్ సంబరాల్లో మెగాస్టార్, అనిల్ రావిపూడి!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్  'మన శంకరవరప్రసాద్ గారు'. సంక్రాంతికి కానుకగా ఈరోజు ( జనవరి 12, 2026 ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.  భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రికార్డుల వేట మొదలు పెట్టింది. సినీ ప్రియుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో మూవీ టీం సంబరాలు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
 
సంబరాల్లో చిత్ర యూనిట్

సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. హీరో చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. సినిమా రిజల్ట్ పట్ల మెగాస్టార్ చిరంజీవి ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ : కూకట్ పల్లి అర్జున్ థియేటర్ లో..

ఈ సినిమాలో చిరంజీవి తన పాత రోజుల గ్రేస్, ఎనర్జీని మళ్ళీ గుర్తుచేశారు. అనిల్ రావిపూడి తనదైన మార్కు కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో చిరులోని వింటేజ్ నటుడిని పూర్తిస్థాయిలో ఆవిష్కరించారు. సినిమా చూసిన ప్రేక్షకులు బాస్ ఈజ్ బ్యాక్.. ఈ సంక్రాంతి బాస్ దే! అంటూ థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు. డ్యాన్స్‌లు, డైలాగ్ డెలివరీలో చిరంజీవి చూపించిన ఈజ్ అభిమానులకు అసలైన కనువిందుగా నిలిచింది.

ALSO READ : కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ ముందుకు విజయ్..

రికార్డుల సునామీ !

ఈ చిత్రం కేవలం టాక్ పరంగానే కాకుండా వసూళ్లలోనూ దుమ్ము రేపుతోంది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే వన్ మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించిన చిరంజీవి రెండో చిత్రంగా ఇది నిలిచింది  ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో (BookMyShow) లో కేవలం 24 గంటల్లోనే 2,86,000 కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి అంటే ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు అభిమానులు. ఈ సంక్రాంతి నిజాంగానే మెగా ఫ్యాన్స్ కు స్పెషల్ గా నిలిచింది.అనిల్ రావిపూడి మార్కు ఎంటర్‌టైన్‌మెంట్, మెగాస్టార్ మేనరిజమ్స్ తోడై ఈ చిత్రం ఈ ఏడాది అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచే దిశగా దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ 'శంకరవరప్రసాద్' ఇంకెన్ని సరికొత్త రికార్డులను తిరగరాస్తారో వేచి చూడాల్సిందే!

ALSO READ : అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంక్రాంతి వేడుకలు..