ChaySobhita: అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంక్రాంతి వేడుకలు.. చైతూతో కలిసి సందడి చేసిన శోభిత!

ChaySobhita: అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంక్రాంతి వేడుకలు.. చైతూతో కలిసి సందడి చేసిన శోభిత!

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ సంక్రాంతి శోభతో కళకళలాడిపోయింది. ప్రతి ఏటా సంక్రాంతి వేడుకలను స్టూడియో ఉద్యోగులతో కలిసి జరుపుకోవడం అక్కినేని వారసత్వంగా వస్తోంది. అయితే ఈ సారి జరిగిన ఈ వేడుకలకు మరింత ప్రత్యేకత చోటు చేసుకుంది. కొత్త జంట నాగచైతన్య, శోభిత ధూళిపాళ కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు.సాంప్రదాయబద్ధంగా  పట్టువస్త్రాలు ధరించి వచ్చిన ఈ జంటను చూసి అక్కడి ఉద్యోగులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ వేడుకలకు కేవలం స్టూడియో సిబ్బంది మాత్రమే కాకుండా, వారి కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించారు.

 ఆత్మీయంగా పలకరిస్తూ.. 

ఈ వేడుకలో చైతన్య, శోభిత స్వయంగా ఉద్యోగులకు భోజనాలు వడ్డించారు. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో ఆత్మీయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగితెలుసుకున్నారు. స్టార్ హోదాను పక్కనపెట్టి, తమ ఇంటి మనుషుల్లా కలిసిపోయి వారు చేసిన పని అక్కడి వారి మనసు గెలుచుకున్నారు ఈ జంట.  పండుగ స్పెషల్ గారెల నుంచి పులిహోర వరకు అన్ని రకాల తెలుగు వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.  భోజనాల అనంతరం ఉద్యోగులు, వారి పిల్లలతో కలిసి చై-శోభిత ఫోటోలు దిగారు. ఈ అపురూప దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత విజయవంతమైన దశలో ఉన్నారు. ఇటీవల వచ్చిన 'తండేల్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, చైతన్య నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆయన భారీ బడ్జెట్ చిత్రం 'వృషకర్మ' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు శోభిత కూడా వరుస ప్రాజెక్టులతో, వెబ్ సిరీస్‌లతో పుల్ బిజీగా ఉంది.

అక్కినేని సంప్రదాయం..

దివంగత అక్కినేని నాగేశ్వరరావు (ANR) మొదలుపెట్టిన ఈ సంప్రదాయాన్ని నాగార్జున కొనసాగించారు. అక్కినేని కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. పెళ్లైన తర్వాత తొలిసారి శోభితతో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంపై అక్కినేని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్రాంతి వేడుకలు కేవలం పండుగ జరుపుకోవడమే కాకుండా, కష్టపడే సిబ్బంది పట్ల అక్కినేని కుటుంబానికి ఉన్న గౌరవాన్ని మరోసారి చాటిచెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.