కూకట్ పల్లి అర్జున్ థియేటర్ లో.. మన శంకర వరప్రసాద్ సినిమా చూస్తూ... గుండెపోటుతో మరణించిన ASI

కూకట్ పల్లి అర్జున్ థియేటర్ లో.. మన శంకర వరప్రసాద్ సినిమా చూస్తూ... గుండెపోటుతో మరణించిన ASI

మెగాస్టార్ చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన మన శంకర వరప్రసాద్ సినిమా సోమవారం ( జనవరి 12 )  విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కి ఒకరోజు ముందే ప్రదర్శించిన ప్రీమియర్ షోలతోనే హిట్ టాక్ అందుకుంది ఈ సినిమా. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించారు. అర్జున్ థియేటర్ లో మన శంకర వరప్రసాద్ సినిమా చూస్తూ 50 ఏళ్ళ ఆనంద్ కుమార్ మరణించారు. 

ఆనంద్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆయన జేబులో ఉన్న ఐడీ కార్డు ఆధారంగా వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆనంద్ కి ఇదివరకే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేక.. థియేటర్లో అధిక సౌండ్, ఇతర కారణాల వల్ల గుండెపోటు వచ్చిందా అన్నది తెలియాలి. 

ఇదిలా ఉండగా.. సాహు గారపాటి, సుస్మిత కలిసి నిర్మించిన ఈ సినిమాకు రూ.105 కోట్ల ప్రీ–రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సినిమా కనీసం రూ.210 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.

కర్ణాటక హక్కులు సుమారు రూ.10 కోట్లకు, అలాగే ఇతర రాష్ట్రాల రైట్స్ సుమారు రూ.5 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ విధంగా ఇండియా మొత్తానికి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువను ట్రేడ్ వర్గాలు సుమారు రూ.120 కోట్లుగా అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద, ఇండియాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.240 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.