ఉదయం స్వల్ప నష్టాలతో స్టార్ట్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత కొద్ది సమయంలోనే భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇంట్రాడేలో అమెరికా రాయబారి చేసిన కామెంట్స్ మార్కెట్ల రికవరీకి కారణమయ్యాయి. బేర్స్ చేతిలో నుంచి మార్కెట్ల దశ దిశను మార్చిన కామెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయం నష్టాల్లో కూరుకుపోయిన భారత స్టాక్ మార్కెట్లు మధ్యాహ్న సమయానికి అనూహ్యంగా కోలుకున్నాయి. అమెరికా రాయబారి సెర్గియో గోర్ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చేసిన సానుకూల వ్యాఖ్యలు మార్కెట్లకు భారీ ఊతాన్నిచ్చాయి.
ALSO READ : జొమాటోలో ఆర్డర్ చేస్తే రూ.655.. రెస్టారెంట్ కి వెళ్లి కొనుక్కుంటే రూ.320..
కుప్పకూలి.. మళ్లీ కోలుకుని..
ఉదయం సెన్సెక్స్ ఏకంగా 715 పాయింట్లు పతనమై 82,861 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా 25,500 స్థాయి కంటే దిగువకు పడిపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. అయితే మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో సెన్సెక్స్ 213 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో ట్రేడవుతూ నష్టాలన్నింటినీ పూడ్చుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా తన నష్టాల నుంచి తేరుకుని 142 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడవుతోంది.
ALSO READ : స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు షాక్.. ATM యూజర్ ఛార్జీలు పెంపు.. తగ్గిన ట్రాన్సాక్షన్స్ లిమిట్
అమెరికా రాయబారి ఏమన్నారు..?
కొత్తగా బాధ్యతలు చేపట్టిన అమెరికా రాయబారి సెర్గియో గోర్.. భారత్-అమెరికా బంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్ కంటే ముఖ్యమైన భాగస్వామి మరొకరు లేరని ఆయన స్పష్టం చేశారు. చాలా కాలంగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడుతూ.. రేపు (మంగళవారం) దీనిపై తదుపరి చర్చలు జరుగుతాయని వెల్లడించారు. అంతేకాకుండా రాబోయే ఒకటి రెండేళ్లలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
టారిఫ్ భయాల నుండి ఉపశమనం..
గత కొంతకాలంగా ట్రంప్ విధిస్తున్న టారిఫ్ హెచ్చరికల వల్ల మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ముఖ్యంగా ఎగుమతులపై ఆధారపడిన కంపెనీల షేర్లు కుప్పకూలాయి. అయితే నిజమైన స్నేహితుల మధ్య విభేదాలు రావడం సహజం, వాటిని పరిష్కరించుకుంటాం అంటూ సెర్గియో గోర్ అనడం ఇన్వెస్టర్లలో భరోసా నింపింది. సెనేటర్ మార్కో రూబియో కూడా ఈ ఏడాది పరస్పర సహకారంతో కూడిన వాణిజ్యం ఉంటుందని పేర్కొన్నారు.
ALSO READ : అనిల్ కుంబ్లే క్రికెటర్ మాత్రమే కాదు..
వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతాయనే ప్రకటన రావడంతో మార్కెట్లో 'షార్ట్ కవరింగ్' జరిగిందని ఎస్‌బీఐ క్యాప్ సెక్యూరిటీస్ ప్రతినిధి సన్నీ అగర్వాల్ తెలిపారు. అమెరికా భారత్‌ను కీలక భాగస్వామిగా గుర్తించడం వల్ల ఎగుమతి ఆధారిత షేర్లలో మళ్లీ కొనుగోళ్లు పెరిగాయి. చూడాలి డీల్ కామెంట్స్ బూస్టర్ డోస్ మార్కెట్లకు ఎంత మేర ప్రయోజనం కలిగించబోతుందనేది.
