- నీటి ఎద్దడి రాకుండా బోర్లు..మంత్రి వివేక్ వెంకటస్వామి
- చెన్నూరు మున్సిపాలిటీలో మినిస్టర్ మార్నింగ్ వాక్
- ఐదు గంటల పాటు అన్ని వార్డుల్లో సుడిగాలి పర్యటన
- పారిశుధ్య పనులు చేపట్టాలని కమిషనర్ కు ఆదేశం
మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో కొత్తగా సీసీ రోడ్లు నిర్మిస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. బోర్లు ఏర్పాటు చేయించి నీటి ఎద్దడి రాకుండా చూస్తామన్నారు. చెన్నూరు మున్సి పాలిటీలో ఆయన ఇవాళ మార్నింగ్ వాక్ నిర్వహించారు. తెల్లవారుజామున 6 గంటల నుంచి 11 గంటల వరకు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో సుడిగాలి పర్యటన చేశారు.
వా ర్డులలో నడుస్తూ పలు అభివృద్ధి పనుల ప్రగతి ని పరిశీలించారు. మృతి చెందిన, అనారోగ్యం బారిన పడ్డ కుటుంబాలను పరామర్శించారు. ఆయా వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, బోర్లు, పారిశుధ్య సమస్యలు పరిష్కారించాలని, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఈ సంద ర్భంగా స్థానికులు మంత్రిని కోరారు.
►ALSO READ | బాల భరోసా, ప్రణామ్ డే కేర్ సెంటర్: మరో రెండు కొత్త పథకాలు ప్రారంభించిన సీఎం రేవంత్..
అవసర మైన నిధులు మంజూరు చేసి త్వరలోనే వార్డు లలో నూతన సీసీ రోడ్లు, బోర్లు వేసి నీటి ఎద్దడి లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన మంత్రి.. వెంటనే పారిశుధ్య చర్యలు చేపట్టాలని మున్సిప ల్ కమిషనర్ మురళీకృష్ణ, ఇతర అధికారులను ఆదేశించారు.
