- ఇరిగేషన్ మంత్రిని కోరిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి
గంగాధర, వెలుగు:గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు ముంపు పరిహారం అందజేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి ఆఫీసులో విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి మంత్రిని కలిశారు. నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు పరిహారం రూ. 20 కోట్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం నుంచి రూ. 23.50 కోట్లు మంజూరు చేయించానని, మరో రూ.20 కోట్లు మంజూరు చేయాలని మంత్రిని కోరినట్లు పేర్కొన్నారు. పరిహారం విషయంలో మంత్రి సానుకూలంగా స్పందించారన్నారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నారాయణపూర్ నిర్వాసితులకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
