మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : రామగుండం ఎమ్మెల్యే రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : రామగుండం ఎమ్మెల్యే రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. శుక్రవారం కార్పొరేషన్​ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రంజాన్​ సందర్భంగా వివిధ విభాగాల ఆఫీసర్లు, మజీద్​ కమిటీలు ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మజీద్​లు, ఈద్గాల వద్ద సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్​ఎఫ్​సీఎల్​, ఇతర సంస్థల సహకారంతో బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. మేయర్​ మహాంకాళి స్వామి మాట్లాడుతూ ఈసారి రూ.14.20 లక్షలతో రంజాన్​ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద మైనార్టీలకు ఇ స్కూటర్ స్కీమ్​ ప్రవేశపెట్టిందని, దీని విలువ రూ.1.50 లక్షలు కాగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న నిరుద్యోగ మైనారిటీ యువకులు తమ వాటాగా రూ.30 వేలు  చెల్లిస్తే మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం రూ.1.20 లక్షలు అందజేస్తుందన్నారు. అంతకుముందు క్యాంపు ఆఫీస్​లో నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి, అంతర్గాం మండలాలకు చెందిన వివిధ శాఖల ఆఫీసర్లు, వివిధ గ్రామాల సర్పంచులతో ఎమ్మెల్యే అభివృద్ధి పనుల పురోగతిపై రివ్యూ చేశారు.