అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీల్లో వసూళ్ల పర్వంపై ఏఐటీయూసీ నేతల ఫిర్యాదు

అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీల్లో వసూళ్ల పర్వంపై ఏఐటీయూసీ నేతల ఫిర్యాదు

జగిత్యాల, వెలుగు: అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీల్లో వసూళ్ల పర్వంపై ఏఐటీయూసీ నేతలు శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏవోకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నేతలు మాట్లాడుతూ ఆరునెలలుగా అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లు, ఆయాలను టార్గెట్ చేస్తూ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్లు, సీడీపీవోలు వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏ కార్యక్రమం జరిగినా ఒక్కో సెంటర్ నుంచి రూ.పది వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వేసవి సెలవుల్లోనూ జీతాలొస్తున్నాయి కదా అని ఒక్కో అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్ నుంచి రూ.1,500 వసూలు చేసినట్టు చెప్పారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్ల పేరుతో రూ.1,500, దసరా మామూళ్ల పేరుతో రూ.1,000, కొత్త ఏడాది కానుకల పేరిట మరో రూ.1,000 వసూలు చేసినట్టు టీచర్లు చెబుతున్నారు.

తాజాగా ఉన్నతాధికారి కూతురి పెండ్లి కోసం రూ.15లక్షలు టార్గెట్ పెట్టి మరీ సిబ్బంది నుంచి వసూలు చేసినట్లు ఆరోపించారు. ఏటా మార్చి ముందు ఐటీ చెల్లించాల్సి ఉంటుందని,  ఐటీ పత్రాలు సమర్పించేందుకు ఒక్కో ఉద్యోగి సుమారు రూ. 10 వేలు ఇవ్వాలని ఉన్నతాధికారి డిమాండ్ చేశారన్నారు. విచారణ చేసి సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నేతలు వెన్న మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తదితరులు కోరారు. దీనిపై ఐసీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి పీడీ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ మాట్లాడుతూ అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లు, ఆయాల నుంచి అక్రమంగా వసూలు చేసినట్లు తన దృష్టికి రాలేదని, తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.